PM Modi : బీజేపీ లక్ష్యం అవినీతిపై పోరాటం
బీజేపీ వ్యవస్థాపక సభలో ప్రధానమంత్రి
PM Modi : ప్రతిపక్షాలపై మరోసారి నిప్పులు చెరిగారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi). గురువారం భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. భగవంతుడు హనుమంతుడిలా చేసే శక్తి తనకు ఇచ్చాడన్నారు. భారతీయ జనతా పార్టీకి ఇతర పార్టీల కంటే ఎక్కువగా నిబద్దత ఉందన్నారు. తమ పార్టీ అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని నిశ్చయించుకుందని చెప్పారు.
ప్రతిపక్షాలు సామాజిక న్యాయం గురించే మాట్లాడతాయి. కానీ ప్రతి భారతీయుడికి సాయం చేయడం కోసం శ్రమించేది మాత్రం బీజేపీననే కుండ బద్దలు కొట్టారు నరేంద్ర దామోదర దాస్ మోదీ. ప్రతిపక్షం తీవ్ర నిరాశలో కూరుకు పోయింది. ఇవాళ దేశానికి దిశా నిర్దేశం చేయగలిగే సత్తా ఒక్కటి తమకు మాత్రమే ఉందన్నారు.
ఇటీవల కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సభలో మోదీ మీ సమాధి తవ్వబడుతుందని చెప్పారు. కానీ వాళ్లకు వాళ్లే సమాధులను తవ్వుకునే పనిలో పడ్డారంటూ ఎద్దేవా చేశారు ప్రధానమంత్రి(PM Modi) . చవకబారు ప్రకటనలతో, వ్యాఖ్యలతో వాళ్లు దేశానికి వ్యతిరేకులుగా తయారయ్యారంటూ ఆరోపించారు. ఇదే సమయంలో రాహుల్ గాంధీ పేరు ఎత్తకుండానే ఒక నాయకుడిపై పోలీస్ కేసు కూడా నమోదైందని చెప్పారు.
Also Read : కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల