Opposition Boycott : స్పీకర్ టీ మీట్ బహిష్కరణ
రాహుల్ గాంధీపై అనర్హత వేటు
Opposition Boycott : రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ ప్రతిపక్షాలు గురువారం షాక్ ఇచ్చాయి. వరుసగా పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించాయి. స్పీకర్ ఓం బిర్లా ఇచ్చిన టీ మీట్ ను కూడా తిరస్కరించాయి(Opposition Boycott) . పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో చివరి రోజు కావడం విశేషం. ఈ సందర్బంగా విపక్ష నేతలు పార్లమెంట్ నుంచి విజయ్ చౌక్ వరకు తిరంగా మార్చ్ చేపట్టారు.
ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ అంశంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణ జరపాలన్న డిమాండ్ కు ప్రతిపక్షాలు కట్టుబడి ఉన్నాయి. చివరి రోజు ఎలాంటి మినహాయింపు లభించలేదు. విపక్ష సభ్యులు ప్ల కార్డులు, నినాదాలు చేయడంతో లోక్ సభ వాయిదా పడింది. ఇదే అంశంపై విపక్ష సభ్యుల ఆందోళనలతో రాజ్యసభ కూడా వాయిదా పడింది. కాంగ్రెస్ పార్టీతో సహా 13 ప్రతిపక్ష పార్టీలు స్పీకర్ టీ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించాయి.
ఇక కాంగ్రెస్ పార్టీ చేపట్టిన తిరంగా మార్చ్ లో డీఎంకే, సమాజ్ వాదీ పార్టీ, ఆర్జేడీ, ఎన్సీపీ, వామపక్షాలు, భావ సారూప్యత కలిగిన పార్టీలు మార్చ్ లో పాల్గొన్నాయి. ఇదిలా ఉండగా సమావేశాన్ని రద్దు చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు.
Also Read : బీజేపీ లక్ష్యం అవినీతిపై పోరాటం