MLA Raghunandan Rao : బండి అరెస్ట్ వెనుక కుట్ర కోణం

ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్ రావు

MLA Raghunandan Rao : భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్ రావు కీల‌క కామెంట్స్ చేశారు. బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజ‌య్ ని కావాల‌నే ఇరికించారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. 10వ త‌ర‌గ‌తి పేప‌ర్ లీక్ కు సంబంధించిన కేసులో రెండు రోజుల్లో రెండు ర‌కాలుగా చెప్ప‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు. త‌మ‌కు తోచిన రీతిలో క‌థ‌లు అల్లారంటూ ఎద్దేవా చేశారు.

గురువారం ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్ రావు(MLA Raghunandan Rao) మీడియాతో మాట్లాడారు. ఎంపీ ఫోన్ సీజ్ చేశార‌న్న విష‌యం చెప్ప‌లేద‌న్నారు. బీజేపీ స్టేట్ చీఫ్ అరెస్ట్ వెనుక కుట్ర కోణం దాగి ఉంద‌న్న అనుమానం వ్య‌క్తం చేశారు. ఇదే కేసుకు సంబంధించి కీల‌కంగా ఉన్న శివ గ‌ణేష్ ఫోన్ ను ఎందుకు పోలీసులు సీజ్ చేయ‌లేదంటూ ప్ర‌శ్నించారు ర‌ఘునంద‌న్ రావు. అత‌డి మొబైల్ నుంచి ఎంత మంది ఎమ్మెల్యేల‌కు స‌ద‌రు మెస్సేజ్ వెళ్లింద‌నే విష‌యం సీపీ చెప్ప‌లేద‌న్నారు.

అరెస్ట్ చేసే స‌మ‌యంలో ఒక ఎంపీ ప‌ట్ల పోలీసులు అనుస‌రించిన తీరు దారుణంగా ఉంద‌న్నారు. మ‌రో వైపు అరెస్ట్ చేసిన వెంట‌నే విడుద‌ల చేశామంటూ లోక్ స‌భ స్పీక‌ర్ కు ప్లాన్ గా తెలియ చేశార‌ని మండిప‌డ్డారు ర‌ఘునంద‌న్ రావు. తాను వ్య‌క్తిగ‌తంగా ఎవ‌రినీ కించ ప‌రిచేలా మాట్లాడ లేద‌న్నారు. అది వారి విజ్ఞ‌త‌కే వ‌దిలి వేస్తున్నాన‌ని చెప్పారు బీజేపీ ఎమ్మెల్యే.

Also Read : అరెస్టులు..జైళ్లు కొత్త కాదు – బండి

Leave A Reply

Your Email Id will not be published!