Nirmala Sitharaman : కాంగ్రెస్ హ‌యాంలోనే అదానీకి పెద్ద‌పీట‌

కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్

Nirmala Sitharaman : ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీపై నిప్పులు చెరిగారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్(Nirmala Sitharaman). అదానీ వ్య‌వ‌హారంపై జాయింట్ పార్ల‌మెంట‌రీ క‌మిటీని ఎందుకు కోరుతున్నారో చెప్పాల‌న్నారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. అవ‌గాహ‌న లేకుండా రాహుల్ మాట్లాడుతున్నార‌ని మండిప‌డ్డారు. కాంగ్రెస్ పార్టీ కేర‌ళ‌లో అధికారంలో ఉన్న‌ప్పుడే విజింజం ఓడ రేవును గౌతం అదానీకి క‌ట్ట‌బెట్టార‌ని ఇది వాస్త‌వం కాదా అని ప్ర‌శ్నించారు.

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీపై వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేయ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. 2019 ఎన్నిక‌ల‌కు ముందు రాహుల్ గాంధీ ఇలాగే మాట్లాడారు. ఇప్పుడు కూడా త‌న తీరు మార్చు కోవ‌డం లేదు. రాహుల్ గాంధీని లీడ‌ర్ గా జ‌నం మ‌రిచి పోయార‌ని ఎద్దేవా చేశారు. భార‌త్ జోడో యాత్ర చేసినంత మాత్రాన దేశం స్వీక‌రిస్తుంద‌ని అనుకోవ‌డం భ్ర‌మేన‌ని కొట్టి పారేశారు.

2024లో జ‌రిగే ఎన్నిక‌ల్లోనూ తాము ప‌వ‌ర్ లోకి వ‌స్తామ‌ని ఇలాగే చూస్తూ ఉండి పోవాల్సిందేనంటూ స్ప‌ష్టం చేశారు నిర్మలా సీతారామ‌న్. విజింజం పోర్టును ఎలాంటి టెండ‌ర్ లేకుండా ఆనాడు ఎందుకు ఇచ్చిందో ఇవాళ దేశానికి చెప్పాల‌ని మంత్రి నిల‌దీశారు.

క‌ర్ణాట‌క‌కు బీజేపీ ఇచ్చిన హామీల‌ను అన్నింటిని నెర‌వేర్చింద‌ని చెప్పారు. ఆర్బీఐ ప్ర‌స్తుతానికి బాగానే ప‌ని చేస్తోంద‌న్నారు. ద్ర‌వ్యోల్బ‌ణం 6 శాతంగా ఉంద‌న్నారు. ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు నిర్మ‌లా సీతారామ‌న్(Nirmala Sitharaman).

Also Read : రూ. 4,567 కోట్ల ప‌నుల‌కు షా శ్రీ‌కారం

Leave A Reply

Your Email Id will not be published!