Bandi Sanjay : అరెస్టులు..జైళ్లు కొత్త కాదు – బండి
కార్యకర్తలు లేఖ రాసిన బీజేపీ చీఫ్
Bandi Sanjay : భారతీయ జనతా పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్(Bandi Sanjay) కీలక వ్యాఖ్యలు చేశారు. పదో తరగతి పేపర్ లీక్ కేసులో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. కరీంనగర్ జైలుకు తరలించారు. ఈ సందర్భంగా జైలు నుంచే కార్యకర్తలకు మనో ధైర్యం ఇచ్చేందుకు లేఖ రాశారు. తనకు కేసులు, అరెస్ట్ లు కొత్త కాదన్నారు. కానీ పేపర్ లీకేజీల వ్యవహారం గురించి ప్రశ్నించినందుకే అక్రమంగా ఇరికించారంటూ ఆరోపించారు.
త్వరలోనే అసలు వాస్తవాలు బయటకు వస్తాయని స్పష్టం చేశారు. పార్టీకి చెందిన నాయకులు, శ్రేణులు , కార్యకర్తలు అధైర్య పడ కూడదని సూచించారు. రాబోయే రాజ్యం మనదేనని పేర్కొన్నారు. ఇంకెంత కాలం లీకులతో రాష్ట్రాన్ని పాలిస్తారంటూ ప్రశ్నించారు. ప్రజలు మార్పును కోరుకుంటున్నారని త్వరలోనే అది నిజం కాబోతోందని జోష్యం చెప్పారు.
గురువారం భారతీయ జనతా పార్టీ ఏర్పడి 44 ఏళ్లవుతోంది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో తాను ఈ లేఖను రాస్తున్నానని తెలిపారు. కేసీఆర్ అవినీతి, రాక్షస పాలనకు చరమ గీతం పాడడమే మన అంతిమ లక్ష్యం కావాలని పిలుపునిచ్చారు.
వ్యవస్థలను నిర్వీర్యం చేసి అరాచక పాలన సాగిస్తున్న కేసీఆర్ కు బుద్ది చెప్పాలన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో చోటు చేసుకున్న వ్యవహారం బయటకు రాకుండా ఉండేందుకే కొత్తగా ఈ లీకును ముందుకు తెచ్చారంటూ ఆరోపించారు బండి సంజయ్(Bandi Sanjay).
Also Read : ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ ఛార్జిషీట్