Temjen Imna Along : భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకులలో మోస్ట్ పాపులర్ గా వినుతికెక్కారు నాగాలాండ్ కు చెందిన రాష్ట్ర మంత్రి టెమ్ జెన్ ఇమ్నా అలోంగ్. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాడు. ప్రతి రోజూ ఏదో ఒక పోస్ట్ పెడుతూ ఆలోచనలు రేకెత్తిస్తుంటాడు.
ఎందుకంటే టెమ్ జెన్ ఇమ్నా చూసేందుకు చాలా సాధారణంగా కనిపిస్తాడు. అందరితో కలిసి పోతాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆయనను కలిసేందుకు, చూసేందుకు, కరచాలనం చేసేందుకు చాలా మంది పోటీ పడతారు. నిత్యం స్పూర్తి దాయకమైన కథలు, తన అనుభవాలను పంచుకుంటారు టెమ్ జెన్ ఇమ్నా(Temjen Imna Along).
గురువారం ట్విట్టర్ వేదికగా తన చిన్ననాటి కథను పంచుకున్నారు. ప్రతి ఒక్కరికీ బాల్యం అనేది చిరస్మరణీయం. అది మనల్ని ఎక్కడికో తీసుకు వెళుతుంది. ప్రతి ఒక్కరు తప్పులు చేయడం సహజం. కానీ వాటిని ఒప్పుకునేందుకు ఎవరూ ఇష్టపడరు.
ఎందుకంటే అందరిలో చులకనై పోతామోనన్న భయం , సిగ్గు ఉంటుంది. నేను కూడా అందుకు మినహాయింపు కాదని తెలిపాడు టెమ్ జెన్ ఇమ్నా.
తల్లిదండ్రులు జన్మను ప్రసాదిస్తే..జీవితంలో సక్రమ మార్గంలో నడిచేందుకు గురువులు దారి చూపిస్తారని, తాను అనుచిత ప్రవర్తన కారణంగా దెబ్బలు కూడా తినాల్సి వచ్చిందని తెలిపాడు. ఆనాడు తన తప్పును ఒప్పుకున్నానని పేర్కొన్నాడు ఇమ్నా(Temjen Imna Along).
మన తప్పును అంగీకరించి దాని నుండి పాఠం నేర్చుకోవాలని మన విద్యా విధానం మనకు నేర్పిందంటాడు ఇమ్నా. ఇప్పుడు ఇమ్నా చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. చదువు బతుకును వెలిగించే సాధనం అంటాడు అవును కదూ.
Also Read : కాంగ్రెస్ తిరంగా మార్చ్