TS High Court Bandi : బండి పిటిషన్ పై హైకోర్టు కామెంట్స్
బయటకు వచ్చాక పేపర్ లీక్ అంటే ఎలా
TS High Court Bandi : టెన్త్ పేపర్ లీకేజీ వ్యవహారంలో బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. తనను అక్రమంగా అరెస్ట్ చేశారని, తనకు ఏ పాపం తెలియదని, కావాలని ఇరికించారంటూ వాపోయారు బండి సంజయ్. వెంటనే బెయిల్ ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో ఆయన తరపున బీజేపీ లీగల్ టీం లంచ్ మోషన్ లో పిటిషన్ దాఖలు చేసింది.
గురువారం ఈ పిటిషన్ పై హైకోర్టు ధర్మాసనం(TS High Court Bandi) విచారణ చేపట్టింది. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
10వ తరగతి పరీక్ష పేపర్ పబ్లిక్ లోకి వచ్చాక అది లీకేజీ అంటే ఎలా అని ప్రశ్నించింది. ప్రభుత్వానికి చురకలు అంటించింది. పేపర్ బయటకు వచ్చాక వాట్సాప్ లో బండి షేర్ చేశాడని తెలిపింది. ముందు పేపర్ ఎలా బయటకు వచ్చిందో దానిపై విచారణ జరపాలని పేర్కొంది. పేపర్ లీకులో బండి పాత్ర ఏమైనా ఉందా అని నిలదీసింది.
ఇక ప్రతిపక్ష నాయకుడిగా ఆయన దానిని వాడుకున్నాడు. చివరకు ఈ కేసుకు సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది కోర్టు. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. మొత్తంగా హైకోర్టు(TS High Court) లేవదీసిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పోయింది. ఇంకో వైపు బండిపై పీడీ యాక్టు నమోదు చేయాలని డిమాండ్ చేశారు బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
Also Read : ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ ఛార్జిషీట్