N Kiran Kumar Reddy : మాజీ సీఎం నల్లారి బీజేపీలోకి జంప్
కాషాయ తీర్థం పుచ్చుకున్న కిరణ్ కుమార్ రెడ్డి
N Kiran Kumar Reddy : ఉమ్మడి ఏపీ మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బిగ్ షాక్ ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రానికి ఆయన చివరి ముఖ్యమంత్రిగా పని చేశారు. శుక్రవారం ఊహించని విధంగా భారతీయ జనతా పార్టీలో చేరారు. కొద్ది రోజుల కిందటే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సమక్షంలో కాషాయ జెండా కప్పుకున్నారు ఢిల్లీలో.
ఇక నల్లారి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నాలుగుసార్లు శాసన సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2004 నుంచి 2009 వరకు ప్రభుత్వ విప్ గా కూడా పని చేశారు. చివరగా ఏపీకి 16వ సీఎంగా ఉన్నారు. ఏపీ విభజనను వ్యతిరేకిస్తూ 2014లో గుడ్ బై చెప్పారు కాంగ్రెస్ కు. ఆ తర్వాత తిరిగి అదే పార్టీలో చేరారు.
దివంగత నేత, సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నమ్మిన వ్యక్తిగా ఉన్నారు. అనుకోకుండా ఆయనకు సీఎం పదవి దక్కింది. ఆయన హయాంలోనే పెద్ద ఎత్తున ఉద్యోగాలు భర్తీ అయ్యాయి. కిరణ్ కుమార్ రెడ్డి(N Kiran Kumar Reddy) చేరడంతో ఏపీలో రాజకీయ సమీకరణలు మారనున్నాయి. నల్లారికి చెందిన సన్నిహితులు, ప్రముఖులు 30 మంది బీజేపీలో చేరనున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా మాజీ సీఎం స్వస్థలం ఆంధ్ర ప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా. హైదరాబాద్ లో పెరిగారు. ఇక్కడే చదువుకున్నారు. మరో వైపు కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు. అన్న బీజేపీ తమ్ముడు టీడీపీ లెక్క బాగా కుదిరిందని అంటున్నారు తెలిసిన వారు.
Also Read : జగన్ పాలన అస్తవ్యస్తం – బాలయ్య