Navjyot Singh Sidhu : ఖర్గేను కలిసిన నవజ్యోత్ సిద్దూ
కాంగ్రెస్ పార్టీకి మంచి భవిష్యత్తు
Navjyot Singh Sidhu : పంజాబ్ మాజీ పీసీసీ చీఫ్ , ప్రముఖ ప్రయోక్త, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ శుక్రవారం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. హత్యా నేరం కేసులో సిద్దూ 10 నెలల పాటు జైలు శిక్ష అనుభవించారు. ఇటీవలే ఆయన చెరసాలను వీడారు. ఈ సందర్బంగా పంజాబ్ లో కొనసాగుతున్న పాలనపై నిప్పులు చెరిగారు.
సీఎం భగవంత్ మాన్ తనంతకు తానుగా బందీ అయ్యాడని, కానీ ఇతరులకు సంబంధించిన సెక్యూరిటీ తొలగించడం దారుణమన్నారు. అందువల్లనే కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ సింగర్ సిద్దూ మూసేవాలా దార/ణ హత్యకు గురైనట్లు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవాళ ఢిల్లీలో ఖర్గేను కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు నవజ్యోత్ సింగ్ సిద్దూ(Navjyot Singh Sidhu) . 9 సార్లు ఎమ్మెల్యేగా, మూడుసార్లు పార్లమెంట్ సభ్యుడిగా, అణగారిన వర్గాల కోసం తన వాయిస్ వినిపిస్తున్న ఖర్గేను కలుసు కోవడం సంతోషం కలిగించిందని పేర్కొన్నారు మాజీ పీసీసీ చీఫ్.
ఆయన పార్టీ పగ్గాలు చేపట్టాక కొత్త ఉత్సాహం వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం సిద్దూ పార్టీలో ఫైర్ బ్రాండ్ గా ఉన్నారు. సంవత్సరం జైలు శిక్ష విధించినప్పటికీ సత్ ప్రవర్తన కారణంగా రెండు నెలలు ముందుగానే నవ జ్యోత్ సింగ్ సిద్దూ విడుదలయ్యారు.
Also Read : ఎంకే స్టాలిన్ కు ఖర్గే ఆహ్వానం