AIMIM JDS : జేడీఎస్ చీఫ్ తో ఓవైసీ చర్చలు
చీలనున్న ముస్లిం ఓటు బ్యాంకు
AIMIM JDS : కన్నడ నాట రాజకీయాలు శరవేగంగా మారి పోతున్నాయి. ప్రస్తుతం పవర్ లోకి రావాలని పరితపిస్తున్న కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని షాక్ తగిలింది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాలలో ఎంఐఎం ప్రధానంగా కాంగ్రెస్ ఓటు బ్యాంకును చీల్చుతోంది. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ పవర్ లో ఉంది. మే 10న పోలింగ్ జరగనుంది. మే 13న ఎన్నికల ఫలితాలు ప్రకటించనుంది కేంద్ర ఎన్నికల సంఘం .
మరో వైపు కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కీలక ప్రకటన చేశారు. జేడీఎస్ సీనియర్ నాయకుడు, మాజీ సీఎం కుమార స్వామితో చర్చలు జరపలేదన్నారు. జేడీఎస్ తో పొత్తు(AIMIM JDS) ఉండదని స్పష్టం చేశారు. తాము ఒంటరిగానే పోటీ చేస్తామని, అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఈ తరుణంలో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ జేడీఎస్ చీఫ్ తో మంతనాలు జరిపినట్లు సమాచారం. దీని ఎఫెక్టు కాంగ్రెస్ పార్టీ పై తప్పక పడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఎంఐఎం 25 స్థానాల్లో బరిలో ఉండనున్నట్లు టాక్. 100 స్థానాల్లో పోటీ చేయనుంది ఎస్డీపీఐ. ఇదిలా ఉండగా ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించింది. దీంతో ఈ నాలుగు పార్టీలు పోటీ చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ నష్టం జరగనుంది.
Also Read : ఖర్గేను కలిసిన నవజ్యోత్ సిద్దూ