Mallikarjun Kharge Stalin : ఎంకే స్టాలిన్ కు ఖర్గే ఆహ్వానం
ఫోన్ లో రావాలని కోరిన ఏఐసీసీ చీఫ్
Mallikarjun Kharge Stalin : ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే శుక్రవారం డీఎంకే చీఫ్ , తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్(Mallikarjun Kharge Stalin) తో ఫోన్ లో మాట్లాడారు. ప్రధానంగా కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఏకం కావాల్సిన అవసరాన్ని ఈ సందర్బంగా పదే పదే ప్రస్తావిస్తూ వచ్చారు.
అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ పార్లమెంట్ నుంచి విజయ్ చౌక్ వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 14 పార్టీలు తిరంగా మార్చ్ చేపట్టాయి.
తాజాగా ప్రతిపక్ష సమావేశంలో పాల్గొనాల్సిందిగా డీఎంకే చీఫ్ , సీఎం స్టాలిన్ ను(MK Stalin) ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఖర్గే చొరవకు సీఎం తన మద్దతు కూడా తెలిపినట్లు సమాచారం. మోదీ సర్కార్ కు వ్యతిరేకంగా ఒక ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించేందుకు, ఐక్య ఫ్రంట్ ను ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ భావ సారూప్యత కలిగిన పార్టీలు, నేతలతో సమావేశాన్ని ప్రతిపాదించింది.
ఇందులో భాగంగానే ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే డీఎంకే చీఫ్ తో ఫోన్ లో సంప్రదించారని సమాచారం. ప్రతిపాదిత సమావేశంలో తన మద్దతుతో పాటు భాగస్వామ్యం వహించేందుకు కూడా సీఎం ఎంకే స్టాలిన్ ఆమోదించారు. ఇదిలా ఉండగా తమిళనాడులో అధికార డీఎంకేతో కాంగ్రెస్ మిత్రపక్షంగా ఉంది.
Also Read : గవర్నర్ రవిపై స్టాలిన్ కన్నెర్ర