N Kiran Kumar Reddy : రాజు తెలివైనోడు ఎవ‌రి మాటా విన‌డు

మాజీ సీఎం న‌ల్లారి కిర‌ణ్ కుమార్ రెడ్డి

N Kiran Kumar Reddy : ఉమ్మ‌డి ఏపీ చివ‌రి సీఎం న‌ల్లారి కిర‌ణ్ కుమార్ రెడ్డి శుక్ర‌వారం బీజేపీలో చేరారు. అనంత‌రం మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. నా రాజు తెలివైన వాడు. కానీ త‌నంత‌కు తానుగా ఆలోచించ‌డు..అదే స‌మ‌యంలో ఎవ‌రి మాట విన‌డు అంటూ ఎద్దేవా చేశారు. ప్ర‌స్తుతం ఆయ‌న చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు న‌ల్లారి సీఎంగా ఉన్నారు. ఒక ర‌కంగా కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్.

నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. సీఎంగా ప‌ని చేశాను. అంత‌కు ముందు ప్ర‌భుత్వ విప్ గా కూడా బాధ్య‌త‌లు చేప‌ట్టా. ఇచ్చిన ప‌ద‌విని స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హించాను. ఆనాడు తెలంగాణ‌లో ఉద్య‌మాన్ని త‌ట్టుకుని నిల‌బ‌డ‌గ‌లిగాను.

పాల‌నా ప‌రంగా నాదైన ముద్ర క‌న‌బ‌ర్చాను. కానీ సుదీర్ఘ కాలం పాటు నా కుటుంబం కాంగ్రెస్ పార్టీతో ముడి ప‌డి ఉంది. కానీ ఇవాళ ఆ పార్టీని తాను వీడుతాన‌ని క‌ల‌లో కూడా అనుకోలేద‌న్నారు న‌ల్లారి కిర‌ణ్ కుమార్ రెడ్డి(N Kiran Kumar Reddy). పార్టీ తీసుకున్న త‌ప్పుడు నిర్ణ‌యాల వ‌ల్ల‌నే ఇవాళ కాంగ్రెస్ కు ఆద‌ర‌ణ లేకుండా పోయింద‌న్నారు. ప్ర‌జ‌లకు దూరంగా పార్టీ వెళుతోంద‌న్నారు. ఇదే స‌మ‌యంలో బీజేపీ నాయ‌క‌త్వాన్ని ప్ర‌శంసించారు. 

మోదీ స‌మ‌ర్థ‌వంత‌మైన నాయ‌క‌త్వం ఆ పార్టీకే కాదు దేశానికి కూడా బ‌లంగా మారింద‌న్నారు మాజీ సీఎం. ఇదిలా ఉండ‌గా పై విధంగా చేసిన కామెంట్స్ రాహుల్ గాంధీని ఉద్దేశించిన‌వ‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. మ‌రో వైపు ఏపీ సీఎం గురించా అన్న అనుమానం కూడా వ్య‌క్తం అవుతోంది.

Also Read : క‌రోనా క‌ల‌కలం జ‌ర భ‌ద్రం

Leave A Reply

Your Email Id will not be published!