CM Nitish Kumar : క‌రోనా వ్యాక్సిన్లు ఇవ్వండి – నితీశ్

కేంద్రానికి బీహార్ సీఎం విన్న‌పం

CM Nitish Kumar : దేశంలో మ‌రోసారి క‌రోనా కేసుల క‌ల‌కలం మొద‌లైంది. గ‌త మూడు రోజులుగా క‌రోనా కేసులు కొత్త‌గా న‌మోద‌వుతున్నాయి. మొన్న 4 వేలు, నిన్న 5 వేలు , శుక్రవారం 6 వేల‌కు పైగా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో కేంద్రం అప్ర‌మ‌త్త‌మైంది.

కేంద్ర మంత్రి మ‌న్సుఖ్ మాండ‌వీయ స‌మీక్ష చేప‌ట్టారు. ముందు జాగ్ర‌త్త‌గా క‌రోనా ప్ర‌బ‌ల‌కుండా ఉండేందుకు గాను త‌మ‌కు వ్యాక్సిన్లు పంపించాల‌ని కేంద్రాన్ని కోరారు బీహార్ సీఎం నితీశ్ కుమార్.

రాష్ట్రంలో కేసులు చాలా త‌క్కువ‌గా ఉన్నాయి. అయిన‌ప్ప‌టికీ అప్ర‌మ‌త్తంగా ఉన్నామ‌ని స్ప‌ష్టం చేశారు. ఆస్ప‌త్రుల‌లో ప్ర‌తి ఒక్క‌రు మాస్క్ లు ధ‌రించాల‌ని సూచించామ‌ని తెలిపారు. ఇప్ప‌టికే కోవిడ్ 19 మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసిన‌ట్లు చెప్పారు నితీశ్ కుమార్(CM Nitish Kumar).

శుక్ర‌వారం సీఎం మీడియాతో మాట్లాడారు. ప్ర‌స్తుతం స‌రిప‌డా వ్యాక్సిన్ల నిల్వ‌లు ఉన్నాయ‌ని, కానీ ముందు జాగ్ర‌త్త‌గా మ‌రిన్ని వ్యాక్సిన్లు కావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. దేశంలోని కొన్ని ప్రాంతాల‌లో పెరుగుతున్న కోవిడ్ కేసుల దృష్ట్యా త‌న ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్తంగా ఉంద‌న్నారు నితీశ్ కుమార్. మా ప‌రీక్ష రేటు జాతీయ స‌గ‌టు కంటే చాలా ఎక్కువ‌గా ఉంద‌న్నారు. ఒక మిలియ‌న్ మందికి ఆరు ల‌క్ష‌ల ప‌రీక్ష‌లు చేప‌ట్టామ‌న్నారు సీఎం.

Also Read : క‌రోనా క‌ల‌కలం జ‌ర భ‌ద్రం

Leave A Reply

Your Email Id will not be published!