PM Modi Slams : కేసీఆర్ సర్కార్ పై మోదీ సెటైర్
ఏ కోశాన సహకరించని ముఖ్యమంత్రి
PM Modi Slams : దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. శనివారం తెలంగాణలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు. ఇదే సమయంలో సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వందే భారత్ రైలును ప్రారంభించారు. అనంతరం ప్రసంగించిన నరేంద్ర మోదీ సీరియస్ కామెంట్స్ చేశారు సీఎం కేసీఆర్ పై(PM Modi Slams). రాష్ట్రంలో కొలువుతీరిన భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం ఏ కోశాన కేంద్రానికి సహకారం అందించడం లేదని మండిపడ్డారు.
తాను ప్రతిసారి తెలంగాణ అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నానని చెప్పారు. కానీ కావాలని సహకరించక పోతే ఎలా అని ప్రశ్నించారు. నాలుగున్నర కోట్ల ప్రజల కలలకు రెక్కలు తొడగాలని, వారందరి అభ్యున్నతి కోసం ఎంతగానో ప్రయత్నం చేస్తుంటే చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు మోదీ. తెలంగాణ పురోభివృద్ది కోసం కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు ప్రధానమంత్రి. హైదరాబాద్ లో జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు మోదీ.
కేంద్రం చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాలను అడ్డం పెట్టుకుని కుటుంబం అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు. ప్రజలకు మేలు చేసే అనేక పథకాలు, కార్యక్రమాలను అమలు చేయకుండా అడ్డుకుంటున్నారంటూ సీఎం కేసీఆర్(CM KCR) పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు పెరిగి పోయాయని వాటిని ఎదుర్కొనేందుకు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ప్రజలకు సంబంధించి ఇబ్బందులు కలిగించవద్దని కోరారు. బీఆర్ఎస్ పాలనలో అవినీతి పేరుకు పోయిందని , బంధుప్రీతి కొనసాగుతోందన్నారు నరేంద్ర మోదీ. ఈ ఏడాది బడ్జెట్ లో మౌలిక సదుపాయాల ఆధునీకరణకు రూ. 10 లక్షల కోట్లు కేటాయించామని చెప్పారు.
Also Read : వందే భారత్ రైలు ప్రారంభం