China Encircles Taiwan : తైవాన్ ను చుట్టు ముట్టిన చైనా
నెలకొన్న యుద్ధ వాతావరణం
China Encircles Taiwan : తైవాన్ ప్రెసిడెంట్ అమెరికాను సందర్శించడంతో మరోసారి డ్రాగన్ చైనా కన్నెర్ర చేసింది. ఈ మేరకు తైవాన్ చుట్టూ చక్రబంధనం వేసింది. ఇప్పటికే సైనిక, ఆర్థిక పరంగా బలంగా ఉన్న చైనా తనకు ఎదురే లేదంటూ విర్ర వీగుతోంది. మరో వైపు భారత్ తోను గిల్లి కజ్జాలకు దిగుతోంది. ఓ వైపు స్నేహం అంటూనే మరో వైపు అరుణాచల్ ప్రదేశ్ లోని 11 ప్రాంతాలకు చైనా కొత్త పేర్లు పెట్టింది.
దీనిని గుర్తించబోమంటూ ఇప్పటికే ఐక్య రాజ్య సమితి, అమెరికా ప్రకటించాయి. భారత్ చైనా దూకుడుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము ఎవరితో యుద్దాన్ని కోరుకోవడం లేదని కానీ తమ అభిమతం శాంతి మాత్రమేనని ప్రకటించింది.
ఈ తరుణంలో తైవాన్ ప్రెసిడెంట్ కూడా ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆమెకు అమెరికా సాదర స్వాగతం పలికింది. ఈ సందర్బంగా తమకు అండగా నిలుస్తూ వచ్చిన యుఎస్ కు ధన్యవాదాలు తెలిపారు. దీనిని జీర్ణించు కోలేని చైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు సైనిక బలగాలను, యుద్ద నౌకలను, ఫైటర్ జెట్ లను మోహరించింది.
తైవాన్(China Encircles Taiwan) చుట్టూ చుట్టుముట్టింది. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన చెందుతున్నారు తైవాన్ దేశ ప్రజలు. మరో వైపు భారత్ సంయమనం పాటించాలని చైనాను కోరింది. కానీ వినిపించుకునే స్థితిలో లేదు.
యుఎస్ హౌస్ స్పీకర్ తో తైవాన్ చీఫ్ సమావేశానికి ప్రతిస్పందనగా చైనా యుద్ద నౌకలను మోహరించింది. ఫైటర్ జెట్ లను ఎగుర వేసింది. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ రంగంలోకి దిగింది.
Also Read : భారత్ కు ఉక్రెయిన్ మంత్రి రాక