Yogi Adityanath : గ్యాంగ్స్టర్స్ ను వదిలి పెట్టను – సీఎం
ప్యాంట్లు తడుస్తున్నాయని కామెంట్
Yogi Adityanath UPCM : యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. గ్యాంగ్ స్టర్స్ లేకుండా చేస్తానని ప్రకటించాడు. ఎవరైనా సరే ఏ పార్టీకి చెందిన వారైనా సరే వదిలి పెట్టనని హెచ్చరించారు. యూపీలో లా అండ్ ఆర్డర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో చట్టం పట్ల గౌరవం ఉండేది కాదన్నారు. కానీ తాను పవర్ లోకి వచ్చాక జడుసుకునేలా చేశానని చెప్పారు. ఎవరైనా తాను గ్యాంగ్ స్టర్ అని చెప్పుకునే స్థితిలో ఇప్పుడు లేదన్నారు. ఆ పరిస్థితి త్వరలోనే లేకుండా చేస్తానని అన్నారు.
ఒకప్పుడు ప్రాణాలు తీసిన వాళ్లు, కరడు గట్టిన నేరస్థులంతా ఇప్పుడు తమ ప్రాణాలు బాగుండాలని పరుగులు తీస్తున్నారని అన్నారు సీఎం. గ్యాంగ్ స్టర్ , రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్ కు శిక్ష విధించిన కొన్ని రోజుల తర్వాత యోగి ఆదిత్యానాథ్ ఈ కీలక కామెంట్స్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గతంలో నేరస్తులు, మాఫియా డాన్ లు ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు సీఎం. పారిశ్రామికవేత్తలను భయాందోళనకు గురి చేశారు. కానీ ఇప్పుడు ఆ సీన్ లేదన్నారు యోగి ఆదిత్యానాథ్(Yogi Adityanath UPCM).
అతిక్ అహ్మద్ పై 100 కేసులు నమోదైనా ఇప్పటి వరకు శిక్ష పడలేదు. ఈసారి యావజ్జీవ కారాగార శిక్ష విధించడం ఇదే తొలిసారి. 60 ఏళ్ల సమాజ్ వాది పార్టీకి చెందిన మాజీ ఎంపీ గుజరాత్ లోని సబర్మతి జైలు నుంచి రోడ్డు మార్గం ద్వారా ప్రయాగ్ రాజ్ లో విచారణ కోసం తీసుకు వచ్చారు. అహ్మద్ తనను చంపేస్తారేమోనని భయపడ్డాడు.
Also Read : బీజేపీలో చేరిన రాజగోపాలాచారి మనవడు