Covid-19 Cases : క‌రోనా కేసుల‌తో ప‌రేషాన్

దేశ వ్యాప్తంగా రెడ్ అల‌ర్ట్

Covid-19 Cases : నిన్న‌టి దాకా త‌గ్గుముఖం ప‌ట్టిన క‌రోనా మ‌హ‌మ్మారి మ‌రోసారి మెల మెల్ల‌గా విజృంభిస్తోంది. గ‌త నాలుగు రోజులుగా క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో కేంద్ర స‌ర్కార్ అప్ర‌మ‌త్తమైంది. ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌ను అప్ర‌మ‌త్తం చేసింది. ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని కోవిడ్ 19(Covid-19 Cases)  మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసింది. ఈ మేర‌కు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మ‌న్సుఖ్ మాండ‌వీయ అత్యవ‌స‌ర స‌మావేశం నిర్వ‌హించారు. ఎప్ప‌టిప్పుడు స‌మాచారం ఇవ్వాల‌ని సూచించారు.

రోగుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆస్ప‌త్రుల‌లో అన్ని మౌలిక స‌దుపాయాల‌ను ఏర్పాటు చేయాల‌ని ఆదేశించారు. వ్యాక్సిన్లు, మందులు అందుబాటులో ఉంచాల‌ని సూచించారు. క‌రోనా క‌ట్ట‌డికి ముందు జాగ్ర‌త్త‌లో భాగంగా ప్ర‌తి ఒక్క‌రు మాస్క్ ధరించాల‌ని స్ప‌ష్టం చేశారు. దేశంలోని మూడు రాష్ట్రాల‌లో క‌రోనా కేసులు న‌మోదు కావ‌డాన్ని కేంద్రం గుర్తించింది.

దేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వ‌హించింది. ప‌లు ప్రాంతాల‌లో క‌రోనా కేసులు గ‌ణ‌నీయంగా పెరిగాయి. అనేక రాష్ట్రాలు మాస్క్ లు త‌ప్ప‌నిస‌రి చేశాయి. ఇందులో భాగంగా ఇప్ప‌టికే హ‌ర్యానా, కేర‌ళ‌, పుదుచ్చేరి రాష్ట్రాలు క‌రోనా ప‌ట్ల జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని, మాస్క్ లు ధ‌రించాల‌ని ఆదేశాలు జారీ చేశాయి.

Also Read : అజింక్యా ర‌హానే అరుదైన రికార్డ్

Leave A Reply

Your Email Id will not be published!