PM Modi Visit : బందీపూర్ టైగ‌ర్ రిజ‌ర్వ్ లో మోడీ సంద‌డి

20 కిలోమీట‌ర్ల మేర ప్ర‌ధాన‌మంత్రి స‌ఫారీ

PM Modi Visit : క‌ర్ణాట‌క‌లో ఆదివారం ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ సంద‌ర్శించారు. బందీపూర్ టైగ‌ర్ రిజ‌ర్వ్ కు చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా 20 కిలోమీట‌ర్ల మేర జీప్ స‌ఫారీని చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా 2022 పులుల గ‌ణ‌న సంఖ్య‌ల‌ను విడుద‌ల చేశారు. 2067 నాటి జ‌నాభా లెక్క‌ల కంటే ఆరు శాతం పెరుగుద‌ల ఉంద‌ని అంచనా.

క‌ర్ణాట‌క‌లోని బందీపూర్ టైగ‌ర్ ప్రాజెక్టు ఏర్ప‌డి 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్బంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ(PM Modi Visit) సంద‌ర్శించారు. అనంత‌రం ఏర్పాటు చేసిన స‌భ‌లో ప్ర‌సంగిస్తారు. ప్ర‌ధానికి ఆవాసాల మెరుగుద‌ల‌లు, నీటి గుంత‌లు, ఏనుగుల శిబిరాల‌ను చూపించారు . అనంత‌రం టైగ‌ర్ ప‌రిర‌క్ష‌ణ కార్య‌క‌లాపాల‌లో పాల్గొన్న ఫ్రంట్ లైన్ ఫీల్డ్ స్టాఫ్ , స్వ‌యం స‌హాయ‌క స‌మూహాల‌తో సంభాషించ‌నున్నారు న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ.

అంతే కాదు ఆస్కార్ అవార్డు పొందిన డాక్యుమెంట‌రీ ది ఎలిఫెంట్ విస్ప‌ర‌ర్స్ లో చిత్రీక‌రించిన త‌మిళ‌నాడులోని ముదుగుల్ టైగ‌ర్ రిజ‌ర్వ్ లోని తెప్ప‌కాడు ఎలిఫెంట్ క్యాంప్ ను కూడా ప్ర‌ధాన‌మంత్రి సంద‌ర్శిస్తారు. చిత్రంలో క‌నిపించిన అనాథ ఏనుగు ర‌ఘుతో పాటు చిన్న జంబోను పెంచిన బొమ్మ‌న్ , బెల్లీని కూడా మోదీ క‌లుస్తారు. అనంత‌రం మైసూరు లోని క‌ర్ణాట‌క స్టేట్ ఓపెన్ యూనివ‌ర్శిటీలో ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌వుతారు.

Also Read : విద్యుత్ ఆదా కోసం సీఎం నిర్ణ‌యం

Leave A Reply

Your Email Id will not be published!