Eknath Shinde : అయోధ్యలో షిండే..ఫడ్నవీస్
త్వరలోనే రామ మందిరం
Eknath Shinde : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆదివారం అయోధ్యను సందర్శించారు. త్వరలోనే రామ మందిరం పూర్తవుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత దర్శించు కోవాలని అనుకున్నామని, పనుల వల్ల రాలేక పోయామని తెలిపారు. ప్రస్తుతం ఆ కోరిక తీరిందన్నారు సీఎం షిండే. అయోధ్యలో రామ మందిరం కడతారా లేదా అన్న అనుమానం ఉండేదని కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు.
పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. సీఎంగా షిండేకు(Eknath Shinde) ఇది తొలిసారి పర్యటన కావడం విశేషం. ఈ సందర్భంగా ఆయన దివంగత బాలా సాహెబ్ ఠాక్రేను గుర్తు చేసుకున్నారు. శివసేన స్థాపకుడు బాలా సాహెబ్ కలను సాకారం చేసినందుకు ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీకి ధన్యవాదాలు తెలియ చేస్తున్నట్లు తెలిపారు షిండే.
గతంలో రామ మందిర నిర్మాణంపై నీలి నీడలు కమ్ముకునేవి. కానీ వాటిని పటాపంచలు చేశారు ప్రధాని. ఆయన ధైర్యానికి హ్యాట్సాఫ్. కోట్లాది రామ భక్తుల కలల్ని నిజం చేశారు. త్వరలోనే ఆ కల వాస్తవ రూపం దాల్చ బోతోందని ఇందుకు తనకు సంతోషంగా ఉందన్నారు ఏక్ నాథ్ షిండే. ఫడ్నవీస్ మాట్లాడుతూ దేశ చరిత్రలో ఇది చారిత్రాత్మకంగా ఉండబోతోందని పేర్కొన్నారు.
Also Read : సీఎం ఐఐటీ డిగ్రీ ఉన్న నిరక్షరాస్యుడు