Satya Pal Malik : సత్య పాల్ మాలిక్ షాకింగ్ కామెంట్స్
ఎస్పీ..ఆర్ఎల్డీ.కాంగ్రెస్ కు మద్దతిస్తా
Satya Pal Malik : భారతీయ జనతా పార్టీకి చెందిన మాజీ గవర్నర్ సత్య పాల్ మాలిక్ షాకింగ్ (Satya Pal Malik) కామెంట్స్ చేశారు. ఆయన బీమార్ , జమ్మూ కాశ్మీర్ , గోవా సహా పలు రాష్ట్రాలకు గవర్నర్ గా ఉన్నారు. ఆయన కేంద్రంలో కొలువు తీరిన బీజేపీని టార్గెట్ చేస్తూ విమర్శిస్తూ వచ్చారు. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్యంగా తన స్టాండ్ మార్చుకోనున్నారు.
ఇదే విషయాన్ని ఓ జాతీయ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సమాజ్ వాది పార్టీ, ఆర్ఎల్డీ, కాంగ్రెస్ పార్టీల తరపున తాను ప్రచారం చేస్తానని పేర్కొన్నారు. ఇప్పటికి కూడా బీజేపీ అంటే ఇష్టమని అంటూనే పోరాటం ఆగదంటున్నారు.
ఆయన గవర్నర్ గా ఉన్న సమయంలోనే కేంద్రాన్ని తప్పు పట్టారు. సాగు చట్టాలు రద్దు చేయాలని కోరుతూ ఆందోళన చేపట్టిన రైతులకు మద్దతుగా నిలిచారు. వారి తరపున తన వాయిస్ ఇచ్చారు. దీంతో దేశ వ్యాప్తంగా సత్య పాల్ మాలిక్(Satya Pal Malik) హాట్ టాపిక్ గా మారారు.
నేను ఎక్కడికీ వెళ్లడం లేదని ఎందుకని అనుకుంటున్నారంటూ ప్రశ్నించారు. నా భద్రతను తగ్గించారు. నాకు చెప్పకుండానే చేశారు. ఇదంతా ఎవరి చేతుల్లో ఉందంటూ కేంద్రాన్ని నిలదీశారు. పాకిస్తాన్ ఉగ్రవాదుల నుంచి తనకు ముప్పు ఉందన్నారు. కానీ మోదీ ప్రభుత్వం పట్టించు కోవడం లేదని ఆరోపించారు. నేను పలుమార్లు సెక్యూరిటీ విషయంపై అమిత్ షాకు లేఖ రాశానని అన్నారు. నేను ఏ పార్టీలో చేరనని స్పష్టం చేశారు సత్య పాల్ మాలిక్. కాశ్మీర్ పై ప్రస్తుతం పుస్తకం రాస్తున్నానని చెప్పారు.
Also Read : కన్నడ భాషలో పరీక్షలు నిర్వహించాలి