Dalai Lama Apologises : తప్పైంది మన్నించండి – దలైలామా
బాలుడికి..కుటుంబానికి విన్నపం
Dalai Lama Apologises : ప్రముఖ ఆధ్యాత్మిక గురు దలైలామా ఎట్టకేలకు దిగి వచ్చారు. ఆయన చేసిన నిర్వాకంపై సర్వత్రా నిరసన వ్యక్తమైంది. ఓ బాలుడితో దలైలామా ప్రవర్తించిన తీరు జుగుస్సాకరంగా ఉందంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. సోషల్ మీడియాలో బాలుడిని తన నాలుకతో చప్పరిస్తావా అంటూ పేర్కొన్న వీడియో హల్ చల్ చేసింది. అది నిమిషాల్లోనే వైరల్ గా మారింది. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో దలైలామా దిగి వచ్చారు. తాను చేసింది తప్పేనంటూ పేర్కొన్నారు.
తాను అలా ప్రవర్తించి ఉండాల్సి ఉండేది కాదని తెలిపారు. ఇందుకు గాను తనను మన్నించాలని కోరాడు. ఎలాంటి దురుద్దేశంతో అలా చేయలేదని పేర్కొన్నాడు దలైలామా. బాలుడికి, వారి కుటుంబ సభ్యులకు తాను క్షమాపణలు(Dalai Lama Apologises) చెబుతున్నట్లు స్పష్టం చేశాడు. అయితే పిల్లలతో ఆడుకోవడం, ఆట పట్టించడం తనకు అలవాటు అని కానీ వీడియోలో అలా లేదని వాపోయాడు.
ప్రస్తుతం దలైలామా, బాలుడికి సంబంధించిన వీడియో ఒక్కసారిగా దలైలామాపై ఉన్న గౌరవాన్ని పోగొట్టేలా చేసింది. మరింత డ్యామేజ్ కాకుండా ఉండేందుకు తానే రంగంలోకి దిగాడు దలైలామా. ప్లీజ్ తప్పైంది ఇంకోసారి అలా జరగదు అంటూ కోరాడు. సో టెక్నాలజీ దెబ్బకు దలైలామా దిగి రావడం విశేషం కదూ.
Also Read : సత్య పాల్ మాలిక్ షాకింగ్ కామెంట్స్