Jupally Krishna Rao : భయపడే సస్పెండ్ చేశారు – జూపల్లి
మాజీ మంత్రి షాకింగ్ కామెంట్స్
Jupally Krishna Rao : మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు షాకింగ్ కామెంట్స్ చేశారు. పార్టీకి సంబంధించి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసులు రెడ్డితో పాటు జూపల్లిని సస్పెండ్ చేశారు ప్రెసిడెంట్ , సీఎం కేసీఆర్. తనను సస్పెండ్ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు . సోమవారం ఎమ్మెల్యే క్వార్టర్స్ కు వచ్చిన జూపల్లి కృష్ణారావుని(Jupally Krishna Rao) సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది.
తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. మూడేళ్ల నుంచి పార్టీ సభ్యత్వం చేయిస్తానంటూ పుస్తకాలు ఇవ్వలేదన్నారు. ఎందుకు సస్పెండ్ చేస్తున్నారో సీఎం కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం బీఆర్ఎస్ జైలు నుంచి వచ్చినట్లు ఆనందంగా ఉందన్నారు. తనకు భయపడే సస్పెండ్ చేశారంటూ పేర్కొన్నారు. ఈ రాష్ట్రం నాది , నా ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేస్తా..నా ఇష్టం వచ్చినట్లు పరిపాలన చేస్తానంటూ విర్రవీగుతున్నారంటూ సీఎంపై నిప్పులు చెరిగారు.
మీకు దమ్ము, ధైర్యం ఉంటే తాను లేవదీసిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు జూపల్లి కృష్ణారావు. తెలంగాణ కోసం తాను పదవులు త్యాగం చేశానని చెప్పారు. ప్రశ్నించడం నేరం ఎలా అవుతుందని నిలదీశారు. ప్రగతి భవన్ డైరెక్షన్ లో పోలీసులు పని చేస్తున్నారంటూ జూపల్లి ఆరోపించారు. తెలంగాణ ద్రోహులా తన గురించి మాట్లాడేది అంటూ మండిపడ్డారు.
Also Read : కేసీఆర్ పై పొంగులేటి కన్నెర్ర