Drone Shut Down : కాశ్మీర్ లోని రాజౌరిలో డ్రోన్ కూల్చివేత
అన్వేషిస్తున్న భారత భద్రతా బలగాలు
Drone Shut Down : పాకిస్తాన్ తన తీరును మార్చు కోవడం లేదు. ఉగ్రవాదులను పెంచి పోషిస్తూనే ఉంది. కాశ్మీర్ లోకి ఎగదోస్తోంది. ప్రస్తుతం టెక్నాలజీ మారడంతో కొత్త ఎత్తులతో దాడులకు తెగ బడుతున్నారు ఉగ్రవాదులు. ప్రస్తుతం డ్రోన్లను పదే పదే ప్రయోగిస్తున్నారు. ఇప్పటికే పలు డ్రోన్లను గుర్తించింది భారత భద్రతా దళాలు.
తాజాగా జమ్మూ , కాశ్మీర్ లోని రాజౌరి నియంత్రణ రేఖ సమీపంలో డ్రోన్ కూల్చేశారు(Drone Shut Down). ఇంకా ఏమైనా ఉన్నాయా అందులో అనే దానిపై భద్రతా బలగాలు దర్యాప్తు చేస్తున్నాయి.
డ్రోన్ కు జోడించిన ప్యాకెట్ లోని కొన్ని మ్యాగజైన్ లు, నగదు, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రాంతంలోని పలు గ్రామాలలో విస్తృతంగా సోదాలు కొనసాగుతున్నాయని పోలీసు వర్గాలు వెల్లడించాయి.
ఈ ప్రాంతంలోని పలు గ్రామాల్లో విస్తృతంగా సోదాలు కొనసాగుతున్నాయని వర్గాలు పేర్కొన్నాయి. నియంత్రణ రేఖ వెంబడి బెరి పటాన్ , సియోట్ ప్రాంతాలలో గత రాత్రి అనుమానాస్పదంగా తిరుగుతున్న డ్రోన్ ను(Drone) గుర్తించారు.
ఆ తర్వాత భారీ కార్బన్ , సెర్చ్ ఆపరేషన్ ను ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఆపరేషన్ సక్సెస్ అయ్యిందని, డ్రోన్ ను విజయవంతంగా కూల్చి వేసినట్లు తెలిపారు. ఇందులో ఏకే రైఫిల్ , కొన్ని మ్యాగజైన్లు, సీల్డ్ ప్యాక్, నగదు ఉందని వెల్లడించారు.
Also Read : రాహుల్ గాంధీకి పాట్నా కోర్టు సమన్లు