Asad Ahmed : 2 నెలల్లో 6 నగరాలు మార్చిన అసద్
ఎట్టకేలకు యూపీ ఝాన్సీలో ఎన్ కౌంటర్
Asad Ahmed : యూపీలో కరడు గట్టిన గ్యాంగ్ స్టర్ మాజీ ఎంపీ ఆతిక్ అహ్మద్ తనయుడు అసద్ అహ్మద్(Asad Ahmed) ను గురువారం ఝాన్సీలో యూపీ స్పెషల్ టీం ఎన్ కౌంటర్ లో హతమార్చింది. అసద్ తో పాటు సహాయకుడు గులాం ను కూడా మట్టుబెట్టింది.
విచిత్రం ఏమిటంటే గత రెండు నెలల్లో అసద్ అహ్మద్ 6 నగరాలు మార్చాడని పోలీసులు తెలిపారు. 2005లో బీఎస్పీ ఎమ్మెల్యే హత్య కేసులో సాక్షి, న్యాయవాది ఉమేష్ పాల్ ను ఫిబ్రవరి 24న హత్య చేసిన కేసులో అసద్ వాంటెడ్ గా ఉన్నాడు. ప్రయాగ్ రాజ్ కాల్పుల తర్వాత అసద్ లక్నోకు పారి పోయాడు. అతడిని పట్టుకునేందుకు 2 నెలల సమయం పట్టింది.
ప్రయాగ్ రాజ్ లో ఎమ్మెల్యే పాల్ ను పలువురు షూటర్లు కాల్చి చంపారు. అతడికి రక్షణగా ఉన్న భద్రతా సిబ్బంది కూడా మరణించారు. ఘటనా స్థలంలోని సీసీ టీవీ ఫుటేజీలో అసద్(Asad Ahmed) తుపాకీ పట్టుకుని కనిపించాడు. కాల్పుల అనంతరం లక్నోకు పారి పోయాడు.
పోలీసుల నుంచి తప్పించు కునేందుకు అనేక నగరాలు మారాడు అసద్. లక్నో నుంచి కాన్పూర్ కు వెళ్లాడు. అక్కడి నుంచి మీరట్ వెళ్లి వారం రోజుల పాటు ఉన్నాడు. ఆ తర్వాత ఢిల్లీలోని సంగమ్ విహార్ ప్రాంతంలో మకాం వేశాడు. అనంతరం ఆజ్మీర్ కు వెళ్లాడు. అక్కడి నుంచి మధ్య ప్రదేశ్ కు పారి పోవాలని అనుకున్నాడు.
అసద్ ట్రాక్ చేయకుండా ఉండేందుకు 10 సిమ్ కార్డులను మార్చాడు. అసద్ గ్యాంగ్ లో తమ ఇన్ ఫార్మర్ ఉన్నాడని పోలీసులు తెలిపారు. పట్టు పడకుండా ఉండేందుకు మారు వేషంలో ఉన్నాడని , 12 మంది సభ్యులతో కూడిన తమపై కాల్పులకు తెగబడ్డారని చెప్పారు.
Also Read : గ్యాంగ్ స్టర్స్ పై యోగి కామెంట్స్ వైరల్