Mayawati : ఎన్ కౌంట‌ర్ ప్ర‌దేశ్ గా మార్చేశారు

సుప్రీంకోర్టు ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాలి

Mayawati : బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీ చీఫ్ , మాజీ సీఎం మాయావ‌తి(Mayawati) షాకింగ్ కామెంట్స్ చేశారు. గ్యాంగ్ స్ట‌ర్స్ మాజీ ఎంపీ అతిక్ అహ్మ‌ద్ , అష్ర‌ఫ్ అహ్మ‌ద్ ల ను కాల్చి చంప‌డాన్ని తీవ్రంగా ఖండించారు. ఇది పూర్తిగా ప్ర‌భుత్వ వైఫ‌ల్యంగా పేర్కొన్నారు.

ఆదివారం మాయావ‌తి ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. ఉమేష్ పాల్ లాగానే గ్యాంగ్ స్ట‌ర్ల‌ను మ‌ట్టు పెట్టారంటూ ఆరోపించారు. దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైన ఈ అత్యంత తీవ్ర‌మైన‌, ఆందోళ‌న‌క‌ర‌మైన సంఘ‌ట‌న‌ను సుప్రీంకోర్టు ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటే మంచిద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు బీఎస్పీ చీఫ్ మాయావ‌తి.

ఆ ఇద్ద‌రినీ పోలీస్ క‌స్ట‌డీలోనే లేపేయ‌డం తీవ్ర అనుమానాల‌కు తావిస్తోంద‌ని, ఇది పూర్తిగా ప్ర‌భుత్వ వైఫ‌ల్యాన్ని సూచిస్తోంద‌ని మండిప‌డ్డారు. ప్ర‌స్తుతం యూపీలో చ‌ట్టం లేకుండా పోయింద‌ని పోలీస్ రాజ్యం న‌డుస్తోందంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు మాయావ‌తి(Mayawati). యూపీ ఎన్ కౌంట‌ర్ ప్ర‌దేశ్ గా మారి పోయింద‌ని మండిప‌డ్డారు. 2005లో బీజేపీ నేత ఉమేష్ పాల్ ను అతిక్ వ్య‌క్తులు దారుణంగా హ‌త్య చేశారు. ప్ర‌స్తుతం మాయావ‌తి చేసిన ఆరోప‌ణ‌లు క‌ల‌క‌లం రేపాయి.

ప్ర‌స్తుతం రాష్ట్రంలో లా అండ్ ఆర్డ‌ర్ పూర్తిగా క‌నిపించ‌కుండా పోయింద‌న్నారు. ఇలా చంపుకుంటూ పోతే చివ‌ర‌కు సాధార‌ణ ప్ర‌జ‌ల ప‌రిస్థితి ఏమిటి అని ప్ర‌శ్నించారు. మాయావ‌తితో పాటు ఎంఐఎం చీఫ్ అస‌దుద్దీన్ ఓవైసీ, ఎస్పీ చీఫ్ , మాజీ సీఎం అఖిలేష్ యాద‌వ్.

Also Read : గ్యాంగ్ స్ట‌ర్ల హంత‌కుల గుర్తింపు

Leave A Reply

Your Email Id will not be published!