Nirmala Sitharaman : శాంతి కోసం అమెరికా..భారత్ ప్రయత్నం
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
Nirmala Sitharaman : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా, భారత్ దేశాలు శాంతి పునాదిగా ప్రయత్నం చేస్తున్నాయని స్పష్టం చేశారు. బలమైన, శాంతియుత గ్లోబల్ కమ్యూనిటీ కోసం భారత్, యుఎస్ బిల్డింగ్ ఫౌండేషన్ సంయుక్తంగా కలిసి పని చేస్తున్నాయని చెప్పారు. ఉగ్రవాదం లేని ప్రపంచం కోసం ఇరు దేశాలు కలిసి కృషి చేస్తున్నట్లు తెలిపారు నిర్మలా సీతారామన్.
మార్పు ఇప్పుడు వివిధ కోణాల్లో నిత్య జీవితంలో మనల్ని ఏదో రకంగా తాకుతోందన్నారు. ప్రతి అంశమూ ఆర్థిక రంగానితో ముడిపడి ఉందన్నారు ఆర్థిక మంత్రి. సామరస్య పూర్వకమైన ప్రపంచ సమాజానికి పునాదులు నిర్మిస్తున్నామని తెలిపారు.
భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధు ఆధ్వర్యంలో ఇండియా హౌస్ లో జరిగిన రిసెప్షన్ లో నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) పాల్గొని ప్రసంగించారు. ఇరు దేశాలు అన్ని రంగాలలో కలిసి పని చేస్తున్నాయని ఇది బలమైన ముద్ర కనబరుస్తోందన్నారు కేంద్ర మంత్రి. ఇదే సమయంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.
భారత దేశానికి దిశా నిర్దేశం చేసిన మహనీయుల్లో ఒకరు అని కీర్తించారు. అణగారిన దళిత సమాజం నుంచి వచ్చాడని పేర్కొన్నారు. కొత్త భారత దేశంలో భాగమయ్యాడని, నిపుణులతో కలిసి రాజ్యాంగాన్ని రచించాడని తెలిపారు.
Also Read : మోదీ ప్రత్యేకమైన నాయకుడు