CM Yogi : యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ సంచలన ప్రకటన చేశారు. గ్యాంగ్ స్టర్లు అతిక్ అహ్మద్ , అష్రఫ్ అహ్మద్ లు కాల్చి చంపబడ్డారు. ఈ తరుణంలో మంగళవారం కీలక వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది. రాష్ట్రంలో మాఫియా అన్నది ఉండ కూడదని, తాను ఆ పదాన్ని విన దల్చు కోలేదని ప్రకటించాడు. గత వారం రోజుల కిందట అతిక్ అహ్మద్ తనయుడు అసద్ తో పాటు షూటర్ గులాం ఎన్ కౌంటర్ లో చని పోయారు.
మీడియాతో మాట్లాడిన సీఎం యోగి ఆదిత్యానాథ్(CM Yogi) నిప్పులు చెరిగారు. ఇప్పుడు రాష్ట్రంలో ఎవరినీ బెదిరించ లేరని హెచ్చరించారు. గతంలో యూపీకి ముప్పుగా ఉన్న వారు ఇప్పుడు యూపీ వారికి ముప్పుగా మారిందన్నారు. ఎవరైనా సరే తప్పు ఒప్పుకోవాల్సిందే. లేక పోతే చావు మాత్రమే వారికి ఆభరణంగా దక్కుతుందన్నారు సీఎం.
2017కు ముందు రాష్ట్రంలో శాంతి భద్రతలు సరిగా లేవన్నారు. ఆ తర్వాత రాష్ట్రంలో చట్ట బద్దత ఉందని చెప్పారు . 2023 దాకా యూపీలో ఎలాంటి అల్లర్లు చోటు చేసుకోలేదని స్పష్టం చేశారు. కర్ఫ్యూ కూడా విధించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. గ్యాంగ్ స్టర్లను ఎవరు ఎంకరేజ్ చేశారో ప్రజలందరికీ తెలుసన్నారు. ఎవరైనా ఏ పార్టీకి చెందిన వారైనా శిక్ష పడక తప్పదని హెచ్చరించారు యోగి ఆదిత్యానాథ్.
Also Read : గ్యాంగ్ స్టర్లపై ఎందుకంత ప్రేమ