Ajit Pawar : బీజేపీలోకి వెళ్ల‌ను ఎన్సీపీ తోనే ఉంటా

స్ప‌ష్టం చేసిన అజిత్ ప‌వార్

Ajit Pawar : ఎన్సీపీ నాయ‌కుడు అజిత్ ప‌వార్ ఆ పార్టీని వ‌దిలేసి వెళుతున్నార‌ని, కాషాయ కండువా క‌ప్పుకుంటున్నార‌ని పెద్ద ఎత్తున జ‌రుగుతున్న ప్ర‌చారానికి తెర దించే ప్ర‌య‌త్నం చేశారు. తాను బీజేపీలోకి వెళ్ల‌డం లేద‌ని , అదంతా ఎవ‌రో కావాల‌ని దుష్ప్ర‌చారం చేశార‌ని ఆరోపించారు. మంగ‌ళ‌వారం అజిత్ ప‌వార్(Ajit Pawar) మీడియాతో మాట్లాడారు. తాను బీజేపీలోకి వెళ్ల‌డం లేద‌ని పేర్కొన్నారు. కొంద‌రు కావాల‌ని త‌న‌ను డ్యామేజ్ చేసేందుకు ఇలా చేశారంటూ వాపోయారు.

ప్ర‌స్తుతం నేను నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాన‌ని స్ప‌ష్టం చేశారు. మ‌హారాష్ట్ర ప్ర‌తిప‌క్ష పార్టీల‌న్నీ క‌లిసి మ‌హా ఘ‌ట్ బంద‌న్ గా ఏర్ప‌డ్డాయి. కానీ స‌ర్కార్ కొద్ది రోజుల పాటే ఉంది. శివ‌సేన కు చెందిన ఏక్ నాథ్ షిండే ఎమ్మెల్యేల‌తో క‌లిసి తిరుగుబాటు చేశారు. ఆపై బీజేపీతో క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో అప్ప‌టి మ‌హారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ కోష్యారీ కీల‌క పాత్ర పోషించిన‌ట్లు ఆరోప‌ణ‌లున్నాయ‌. ఆయ‌న జోక్యాన్ని సుప్రీంకోర్టు కూడా తీవ్రంగా వ్యాఖ్యానించింది.

ఇదిలా ఉండ‌గా అజిత్ ప‌వార్(Ajit Pawar) మీడియాపై మండిప‌డ్డారు. ఎలాంటి ఆధారాలు లేకుండా, కార‌ణాలు తెలుసు కోకుండా ఎలా ప్ర‌చారం చేస్తారంటూ ప్ర‌శ్నించారు. ఇది నైతిక‌త‌కు సంబంధించిన అంశ‌మ‌ని పేర్కొన్నారు. ఒక‌వేళ పోవాల‌ని అనుకుంటే తానే పిలిచి చెబుతాన‌ని తెలిపారు. ఎన్సీపీలోనే ఉన్నా..ఎప్ప‌టికీ ఆ పార్టీతోనే ఉంటాన‌ని మ‌రోసారి స్ప‌ష్టం చేశారు అజిత్ ప‌వార్.

Also Read : యూపీలో మాఫియా చెల్ల‌దు – యోగి

Leave A Reply

Your Email Id will not be published!