Shashi Tharoor : వందే భార‌త్ రైలు భేష్ – శ‌శి థ‌రూర్

కేర‌ళ‌లో స్టార్ట్ చేస్తున్నందుకు థ్యాంక్స్

Shashi Tharoor : కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు శ‌శి థ‌రూర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కేర‌ళ‌లోని తిరువ‌నంత‌పురం ఎంపీగా కొన‌సాగుతున్నారు. ఈ సంద‌ర్భంగా వందే భార‌త్ రైలు కేర‌ళ నుంచి ప్రారంభిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ.

ఏప్రిల్ 25న పీఎం ప్రారంభించ‌నున్నారు అధికారికంగా. ఈ సంద‌ర్భంగా శ‌శి థ‌రూర్(Shashi Tharoor) ప్ర‌ధానికి థ్యాంక్స్ చెప్పారు. ఈ వందే భార‌త్ రైలును కేర‌ళ లోని తిరువ‌నంత‌పురం లో వందే భార‌త్ ఎక్స్ ప్రెస్ ను ప్ర‌ధాని జెండా ఊపి ప్రారంభించ‌నున్నారు.

ఈ సంద‌ర్భంగా ఎంపీ స్పందించారు. ఆనందంగా ఉంద‌ని పేర్కొన్నారు. కేంద్రం ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల శ‌శి థ‌రూర్ బుధ‌వారం ప్ర‌శంసించారు. న‌రేంద్ర మోడీ జెండా ఊపి హాజ‌ర‌య్యేందుకు తాను కూడా ఎదురు చూస్తున్నాన‌ని స్ప‌ష్టం చేశారు కాంగ్రెస్ ఎంపీ. కేంద్రం చ‌ర్య‌పై స్పందిస్తూ కాంగ్రెస్ నాయ‌కుడు గ‌త ఏడాది ఫిబ్ర‌వ‌రి 1న కేర‌ళ‌లో వందే భార‌త్ రైలును(Vande Bharat Express) న‌డ‌పాల‌ని సూచించారు. ఆనాడు తాను చేసిన ట్వీట్ ను ఈ సంద‌ర్భంగా ఉద‌హ‌రించారు.

వందే భార‌త్ రైళ్ల‌ను కేర‌ళ‌కు తీసుకు రావ‌డం ద్వారా అభివృద్దిని ప్రోత్స‌హించేందుకు , భూసేక‌ర‌ణ‌, ప‌ర్యావ‌ర‌ణ ప్ర‌భావం గురించి ఆందోళ‌న‌ల‌ను త‌గ్గించేందుకు వేగ‌వంత‌మైన రైలు ప్ర‌యాణం కోసం ఆందోళ‌న కొంత మేర త‌గ్గుతుంద‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశారు. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల దృష్ట్యా ఇది కీల‌క‌మ‌ని పేర్కొన్నారు శ‌శి థ‌రూర్. రాజ‌కీయ‌ల‌కు అతీతంగా పురోగ‌తి ఉండాల‌ని పేర్కొన్నారు ఎంపీ.

Also Read : జీఎన్ సాయిబాబా విడుద‌ల ర‌ద్దు

Leave A Reply

Your Email Id will not be published!