Mukul Roy Health : పశ్చిమ బెంగాల్ కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు ముకుల్ రాయ్(Mukul Roy Health) ప్రస్తుతం తీవ్ర అస్వస్థతతో ఉన్నారని, ఆయనకు తక్షణమే వైద్య సాయం అవసరమని పేర్కొన్నారు కొడుకు సుభ్రాన్షు రాయ్. ఉత్తర కృష్ణానగర్ ఎమ్మెల్యేగా ఉన్న ముకుల్ రాయ్ 2021 అసెంబ్లీ ఎన్నికల తర్వాత తన కొడుకుతో కలిసి భారతీయ జనతా పార్టీ నుంచి తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఇదే సమయంలో ముకుల్ రాయ్ తిరిగి బీజేపీలోకి వెళుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆయన చేసిన ప్రకటనను సీరియస్ గా తీసుకోవద్దంటూ కోరారు సుభ్రాన్షు రాయ్.
మా నాన్న చెప్పింది నేను విన్నాను. ఆయనకు ప్రస్తుతం వైద్య సాయం కావాలి. శారీరక, మానసిక, నరాల సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. మా తండ్రిని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగంచు కోవాలని ప్రయత్నిస్తున్న వారు సిగ్గు పడాలి అని మండిపడ్డారు. సుభాంశు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు.
పరిస్థితి ఏమంత బాగోలేదు. డిమోన్షియా , పార్కిన్సన్ వ్యాధితో బాధ పడుతున్నాడని వాపోయాడు. ఎన్నికల్లో గెలుపొందేందుకు వ్యూహాలు పన్నడంలో ముకుల్ రాయ్ పేరు పొందారు. 2017లో బీజేపీలో చేరారు. పశ్చిమ బెంగాల్ 2019 లోక్ సభ ఎన్నికల విజయంలో కీలక పాత్ర పోషించారు.
Also Read : అజిత్ పవార్ చేరితే బీజేపీతో కటీఫ్