Angkita Dutta : యూత్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ బీవీ శ్రీనివాస్ పై సీరియస్ కామెంట్స్ చేశారు అదే పార్టీకి చెందిన మహిళా నాయకురాలు. అస్సాం మాజీ యూత్ చీఫ్ అంకతా దత్తా(Angkita Dutta) సంచలన ఆరోపణలు చేశారు. మానసికంగా, శారీరకంగా వేధింపులకు పాల్పడ్డాడని వాపోయారు. ఇదే విషయం గురించి తాను రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు ఫిర్యాదు చేశానని, ఇప్పటి వరకు పట్టించు కోలేదని ఆవేదన వ్యక్తం చేశారు అంకితా దత్తా. శ్రీనివాస్ పై ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ నిలదీశారు .
ఇదిలా ఉండగా అంకితా దత్తా 2021లో ఇండియన్ యూత్ కాంగ్రెస్ అస్సాం యూనిట్ చీఫ్ గా ఎన్నికయ్యారు. జాతీయ యూత్ కాంగ్రెస్ చీఫ్ బీవీ శ్రీనివాస్ పై ఆమె తీవ్ర అభియోగాలు మోపారు. అతను తనపై పరువు నష్టం కలిగించే భాషను ఉపయోగించాడని ఆరోపించారు. దీనిపై సీరియస్ గా స్పందించారు బీవీ శ్రీనివాస్. ఆమెకు పరువు నష్టం నోటీసు కూడా పంపారు. దీంతో ఇరువురి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పార్టీకి సంబంధించి ఫిర్యాదు చేశానని ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదన్నారు.
బీవీ శ్రీనివాస్ అస్సాంకు వచ్చినప్పుడు నన్ను డాక్టర్ దత్తా లేదా అంకితా అని కాకుండా అమ్మాయి అని సంబోదించారంటూ ఆరోపించింది. ఆపై ఛత్తీస్ గఢ్ లోని ఒక హోటల్ లో జరిగిన ఇండియన్ యూత్ కాంగ్రెస్ సెషన్ లో శ్రీనివాస్ నన్న మీరు వోవడ్కా లేదా టేకిలా తాగుతారా అంటూ కోరారని వాపోయారు.
Also Read : ముకుల్ రాయ్ పరిస్థితి బాగో లేదు