Bandi Sanjay Revanth : సీఎం కాలేననే రేవంత్ కంటతడి
బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్
Bandi Sanjay Revanth : భారతీయ జనతా పార్టీ , కాంగ్రెస్ పార్టీల మధ్య యుద్ద వాతావరణం నెలకొంది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
మునుగోడు లో జరిగిన ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ రూ. 25 కోట్లు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిందని ఆరోపించారు. అయితే దీనిపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఆయన భాగ్యలక్ష్మి అమ్మవారి గుడి సాక్షిగా కీలక ప్రకటన చేశారు. ఆపై కంట తడి పెట్టారు. దీనిపై స్పందించారు బీజేపీ చీఫ్ బండి సంజయ్(Bandi Sanjay) .
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చేతుల్లో లేదన్నారు. ఆ పార్టీ ఎప్పుడో సీఎం కేసీఆర్ కు, భారత రాష్ట్ర సమితికి సరెండర్ అయ్యిందని ఆరోపించారు. ఇక టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి తాను సీఎం కావాలని కోరుకున్నాడని, కానీ కాంగ్రెస్ నాయకులంతా జంప్ జిలానీలుగా మారడంతో ఇక ముఖ్యమంత్రిని కాలేమోనని బాధకు గురయ్యాడని సానుభూతి వ్యక్తం చేశారు. దీంతో కన్నీళ్లు పెట్టుకున్నాడని పేర్కొన్నారు బండి సంజయ్.
ఇదిలా ఉండగా రేవంత్ రెడ్డి(Revanth Reddy), ఈటల రాజేందర్ మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. ఒకరిపై మరొకరు కారాలు మిరియాలు నూరుతున్నారు. అయితే ఈటల చేసిన ఆరోపణలు వాస్తవమేనంటూ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆ డబ్బులను తీసుకుందని తమ నాయకుడు ఆరోపించాడని కానీ ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి తీసుకున్నట్లు చెప్పలేదన్నారు. అలా చెప్పినట్లు మీరు నిరూపిస్తారా అంటూ సవాల్ విసిరారు బండి సంజయ్.
Also Read : రేవంత్ సవాల్ ఈటల్ ప్రతి సవాల్