గ్యాంగ్ స్టర్స్ అతిక్ అహ్మద్, అశ్రఫ్ అహ్మద్ లను కాల్చి చంపిన తర్వాత దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. దీని వెనుక యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఉన్నారు. యూపీలో మాఫియాను మట్టిలో కలిపేస్తానంటూ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. ఈ తరుణంలో యోగి టార్గెట్ గా మారారు. తాజాగా సీఎం యోగికి బెదిరింపు కాల్ వచ్చింది. ఆయనను చంపుతామంటూ గుర్తు తెలియని వ్యక్తి ఒకరు కాల్ చేశారని సమాచారం.
సుశాంత్ గోల్ఫ్ సిటీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఈ బెదిరింపు కాల్ డయల్ 112 కు మెస్సేజ్ వచ్చింది. ఈ మెస్సేజ్ లో సీఎం యోగిని లేపేస్తామంటూ ఉంది. దీంతో రాష్ట్ర పోలీసులు అలర్ట్ అయ్యారు. తాను త్వరలోనే చంపుతానంటూ ప్రకటించడం కలకలం రేపింది. ఐపీసీ సెక్షన్ 506, 507, ఐటీ యాక్ట్ 66 కింద కేసు నమోదు చేశారు.
యూపీలో రెండోసారి యోగి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ పవర్ లోకి వచ్చింది. ఆ తర్వాత అక్రమార్కుల ఆట కట్టించాడు. బుల్డోజర్లను రంగంలోకి దించాడు. నేరస్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించాడు. చాలా మంది గ్యాంగ్ స్టర్లు యూపీని విడిచి పారి పోయేలా చేశాడు. ఇంకొందరు స్వచ్చంధంగా లొంగి పోవడం విస్తు పోయేలా చేసింది. ప్రస్తుతం యోగి హాట్ టాపిక్ మారారు. ఈ తరుణంలో బెదిరింపు కాల్ రావడంతో భద్రతను మరింత పెంచారు.