కరళలో తొలిసారిగా వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ప్రారంభించారు. తిరువనంతపురంలో ప్రధాని జెండా ఊపి స్టార్ట్ చేశారు. పీఎం తిరువనంతపురం ఎయిర్ పోర్టులో దిగారు. అక్కడి నుంచి నేరుగా సెంట్రల్ రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. దారి పొడవునా ప్రధానికి ఘన స్వాగతం లభించింది. వేలాది మంది రోడ్డుకు ఇరు వైపులా బారులు తీరి నిలిచారు. ఎండ ఉన్నా ఎక్కడా లెక్క చేయలేదు. చిన్నారుల నుంచి పెద్దల దాకా మోదీకి ఘన స్వాగతం పలికారు.
ప్రధానమంత్రిపై పూల వర్షం కురిపించారు. రెండు రోజుల పర్యటనలో ఉన్నారు మోదీ కేరళలో. సోమవారం సాయంత్రం రోడ్ షో చేపట్టారు. ఆయన సెక్యూరిటీని కాదని ప్రజలను కలిసేందుకు ఉత్సుకత చూపించారు. ఆయన ఈ సందర్బంగా ట్వీట్ చేశారు. తనపై కురిపిస్తున్న ప్రజల ఆదరాభిమానాలను తాను మరిచి పోలేనని స్పష్టం చేశారు. ఒక రకంగా కేరళ వాసులకు తాను ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నానని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా తిరువనంతపురంలో ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు ప్రముఖ రచయిత, కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్. ఆయన కాంగ్రెస్ పార్టీకి చెందిన వారైనప్పటికీ మోదీ చేస్తున్న ప్రయత్నాన్ని అభినందించారు.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. గత పాలకులు అభివృద్ధి గురించి పట్టించు కోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ తాము 2014లో అధికారంలోకి వచ్చాక మౌలిక వసతుల కల్పనకు కృషి చేశామని స్పష్టం చేశారు నరేంద్ర మోదీ.