పోలీసులపై దురుసుగా ప్రవర్తించడమే కాకుండా చేయి చేసుకున్నారన్న ఆరోపణలపై వైఎస్సార్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిలను అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరు పర్చగా 14 రోజుల రిమాండ్ విధించింది. తాను కావాలని అలా చేయలేదని , తనకు ఏ పాపం తెలియదంటూ కోర్టులో వాపోయింది. ఇదిలా ఉండగా మహిళా కానిస్టేబుల్ చెంప ఛెళ్లుమనిపించింది. ఆపై ఎస్ఐ రవీందర్ భుజం పట్టుకుని తోసేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. దీంతో కోర్టులో హాజరు పర్చిన అనంతరం నేరుగా చంచల్ గూడ జైలుకు తరలించారు.
మంగళవారం తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వైఎస్ షర్మిల పిటిషన్ దాఖలు చేసింది. విచారించిన కోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. ఆమెపై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇలా దాడులు చేయడం, నోటికి వచ్చినట్లు మాట్లాడటం, ఆపై కేసులు , అరెస్ట్ లు తీరా బెయిళ్లు అలవాటుగా మారి పోయాయి పొలిటికల్ లీడర్లకు. ఇదేమి రాజకీయం అని ప్రశ్నిస్తున్నారు.
ఎక్కడికైనా వెళ్లాలని అనుకుంటే కోర్టు అనుమతి తప్పనిసరి. ఎట్టకేలకు బెయిల్ మంజూరు కావడంతో షర్మిలకు ఊరట లభించినట్లయింది. ఆమె సిట్ కు వెళుతుండగా ఆఫీసు నుంచి బయటకు వెళ్లనీయలేదు పోలీసులు. దీనిని ప్రశ్నించారు వైఎస్ షర్మిల. ఆ తర్వాత వాగ్వావాదం చోటు చేసుకుంది. ఆ తర్వాత ఎస్ఐ రవీందర్ ఫిర్యాదు మేరకు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.