ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్కడికి వెళ్లినా ఆదరణ లభిస్తోంది. ఆయనకు చిన్నారుల నుంచి పెద్దల దాకా ఫ్యాన్స్ ఉన్నారు. పీఎం రెండు రోజుల పర్యటనలో భాగంగా కేరళలో ఉన్నారు. కొచ్చిలో భారీ రోడ్ షో చేపట్టారు. అనంతరం తిరువనంతపురంకు చేరుకున్నారు.
అక్కడి నుంచి నేరుగా రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు మార్గమధ్యం ద్వారా. దారి పొడవునా పెద్ద ఎత్తున మోదీకి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ట్వీట్ చేశారు. తాను ఎంతో సంతోషానికి లోనయ్యానని , ప్రతి ఒక్కరి ప్రేమకు నోచుకోవడం తనను మరింత ఆనందపడేలా చేసిందన్నారు మోదీ.
ఇదే సమయంలో కేరళలో తొలిసారిగా ప్రవేశ పెట్టిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును మంగళవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు. ఆయన ఇదే ట్రైన్ లో కొంత దూరం ప్రయాణం చేశారు. ఇందులో భాగంగా విద్యార్థులతో ముచ్చటించారు. ట్రైన్ ఎలా ఉందని అడిగారు.
ఏం చదువుతున్నారని కుశల ప్రశ్నలు వేశారు. ఇదే సమయంలో వందే భారత్ ట్రైన్ ను, మోదీ బొమ్మతో కూడిన చిత్ర పటాన్ని ప్రధానమంత్రి మోదీకి బహూకరించారు చిన్నారులు. ఆయన ఉబ్బితబ్బిబ్బయ్యారు.
తాను నిర్వహించే మన్ కీ బాత్ ను మీరంతా వినాలని కోరారు. భవిష్యత్తులో దేశానికి మంచిగా చదువుకుని సేవలు చేయాలని కోరారు.