JC Prabhakar Reddy : తాడిపత్రిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మున్సిపల్ చైర్మన్ గా ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి(JC Prabhakar Reddy) ప్రజా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గత మూడు రోజులుగా నిరాహారదీక్షకు దిగారు. మున్సిపల్ అజెండాలో పొందు పరిచేంత దాకా తాను వెనక్కి తగ్గేది లేదంటూ స్పష్టం చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి. తెలుగుదేశం పార్టీకి చెందిన కౌన్సిలర్లతో కలిసి మున్సిపల్ ఆఫీసు ఆవరణలో ఆందోళన చేపట్టారు.
ఈ సందర్బంగా మున్సిపల్ కమిషనర్ పై నిప్పులు చెరిగారు జేసీ ప్రభాకర్ రెడ్డి. కమిషనర్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు. పట్టణ ప్రజల సమస్యలు పట్టించుకోని కమిషనర్ ఎందుకు అని నిలదీశారు.
ఈ సందర్బంగా ఏపీ సర్కార్ ను ఏకి పారేశారు. ప్రభుత్వ పాలన గాడి తప్పిందని, అధికారులు బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు జేసీ ప్రభాకర్ రెడ్డి(JC Prabhakar Reddy). ఇలాంటి పాలన తాను చూడలేదని పేర్కొన్నారు. వ్యవస్థలను నిర్వీర్యం చేసి ప్రజలను ఇబ్బంది పెట్టడం పనిగా పెట్టుకున్నారంటూ ఆరోపించారు.
తాము పనులేమీ అడగడం లేదని పేర్కొన్నారు. కానీ ప్రజలకు సంబంధించిన ఇబ్బందులు తొలగించాలని మాత్రమే కోరుతున్నామని స్పష్టం చేశారు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి. ఇసుక అక్రమ రవాణా నివారించాల్సిన వాళ్లు కోర్టు ద్వారా తనను గృహ నిర్బంధం ఎలా చేస్తారంటూ నిప్పులు చెరిగారు. కౌన్సిల్ సభ్యులు చేస్తున్న నిరసన కార్యక్రమం వద్దకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారంటూ ఆరోపించారు.
Also Read : షర్మిల ఖండించినా నోరు మెదపని జగన్