Vundavalli Arun Kumar : బీజేపీపై ఉండ‌వ‌ల్లి కామెంట్స్

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఒంట‌రిగానే పోటీ

Vundavalli Arun Kumar : మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్(Vundavalli Arun Kumar) సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఏపీలో ఎన్నిక‌లు జ‌రిగేందుకు టైం ఉన్న‌ప్ప‌టికీ రాజ‌కీయాలు మ‌రింత వేడిని రాజేస్తున్నాయి. ఓ వైపు చంద్ర‌బాబు , త‌న‌యుడు లోకేష్ పాద‌యాత్ర‌ల పేరుతో ప‌ర్య‌టిస్తున్నారు. మ‌రోవైపు అభివృద్ది పేరుతో సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లేందుకు ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నం చేస్తోంది. ఈ త‌రుణంలో ఉండ‌వ‌ల్లి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఆయ‌న నిత్యం ఏపీ రాజ‌కీయాల‌పై ఫుల్ ఫోక‌స్ పెట్టారు. అపార‌మైన అనుభ‌వం క‌లిగిన ఉండ‌వ‌ల్లి ఏది మాట్లాడినా అది క్ష‌ణాల్లో వైర‌ల్ గా మారుతోంది.

భార‌తీయ జ‌న‌తా పార్టీ దృష్టిలో వైసీపీ, టీడీపీ రెండూ ఒక్కటేన‌ని భావిస్తోంద‌న్నారు. నాకు తెలిసినంత వ‌ర‌కు బీజేపీ ఈసారి జ‌ర‌గ‌బోయే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో , లోక్ స‌భ ఎన్నిక‌ల్లో ఒంట‌రిగానే బ‌రిలోకి దిగే ఛాన్స్ ఎక్కువ‌గా ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. బుధ‌వారం ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. బీజేపీ ఎప్పుడూ త‌న‌కు వ‌చ్చే సీట్ల‌పైనే ఎక్కువ‌గా ఫోక‌స్ పెడుతుంద‌న్నారు. మిగ‌తా వాటిని పెద్ద‌గా ప‌రిగ‌ణ‌లోకి తీసుకోద‌న్నారు ఉండ‌వల్లి.

ఏపీలో 25 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఎలా వ‌ర్క‌వుట్ చేయాల‌నే దానిపై బీజేపీ చూస్తుందే త‌ప్పా రాష్ట్ర స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు ప్రయ‌త్నం చేయ‌ద‌న్నారు. ఒక‌వేళ జ‌న‌సేన ముందుకు వ‌స్తే బీజేపీ క‌లుస్తుంద‌న్నారు. లేక పోతే వైసీపీ, టీడీపీని ద‌గ్గ‌ర‌కు రానివ్వ‌ద‌న్నారు మాజీ ఎంపీ. ఈ దేశాన్ని బ‌తికిస్తున్న నాలుగు రాష్ట్రాలు ద‌క్షిణాదికే చెందిన‌వ‌న్న విష‌యాన్ని గుర్తు పెట్టుకోవాల‌న్నారు.

Also Read : ప్ర‌యాణీకుల‌కు ఆర్టీసీ తీపి క‌బురు

Leave A Reply

Your Email Id will not be published!