Prashant Kishor : తేజస్వీ జాబ్స్ జాడేది – పీకే
క్షమాపణ చెప్పాలని డిమాండ్
Prashant Kishor : ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్(Prashant Kishor) షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొలువుల కోసం పోరాడిన డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ మంత్రివర్గంలో చేరాక మరిచి పోయాడంటూ నిప్పులు చెరిగారు పీకే. లక్షలాది మంది నిరుద్యోగులు కొలువుల కోసం ఎదురు చూస్తున్నారని వాపోయారు. పవర్ లోకి రాక ముందు ఒక మాట కేబినెట్ లోకి వచ్చాక ఇంకో మాట మాట్లాడటం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.
ఎంపీల ప్రాతినిధ్యం లేని పార్టీలు ప్రతిపక్షాలను ఏకం చేస్తామని ప్రయత్నం చేయడం విడ్డూరంగా ఉందన్నారు ప్రశాంత్ కిషోర్. ఇటీవలే బీహార్ సీఎం నితీశ్ కుమార్ , డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ కలిసి పశ్చిమ బెంగాల్ లో పర్యటించారు. సీఎం మమతా బెనర్జీని కలిసి బీజేపీకి వ్యతిరేకంగా జత కట్టాలని కోరారు. ఇందుకు బీహార్ వేదికగా సమావేశం కావాలని సూచించారు.
దీనిపై సీరియస్ కామెంట్స్ చేశారు ప్రశాంత్ కిషోర్(Prashant Kishor). ఎంపీల ప్రాతినిధ్యం లేని వాళ్లు ఎలా ప్రయత్నం చేస్తారంటూ ప్రశ్నించారు. రాష్ట్రాన్ని ఉద్దరించ లేని వాళ్లు దేశాన్ని ఎలా ఉద్దరిస్తారంటూ నిలదీశారు ప్రశాంత్ కిషోర్. ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. ఖాళీగా ఉన్న జాబ్స్ ను భర్తీ చేస్తానంటూ హామీ ఇచ్చిన డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ తన అన్న మాటను నిలబెట్టుకోలేక పోయాడని వెంటనే క్షమాపణ చెప్పాలంటూ పీకే డిమాండ్ చేశారు.
Also Read : కర్ణాటక సర్కార్ 1.5 లక్షల కోట్లు లూటీ