DK Shivkumar : మార్పు తథ్యం అధికారం ఖాయం
కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్
DK ShivKumar : కన్నడ నాట రాజకీయం ఊపందుకుంది. మాటల యుద్దం కొనసాగుతోంది. నువ్వా నేనా అంటూ విమర్శలు కురిపించడం మామూలై పోయింది. ఈసారి ఎన్నికలు అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మధ్య పోరు కొనసాగుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ డీకే శివకుమార్ సారథ్యంలో పార్టీ దూసుకు పోతోంది. కాంగ్రెస్ కు పూర్వ వైభవాన్ని తీసుకు రావడంలో ఎనలేని కృషి చేశారు. ఆయన ప్రజలను చైతన్యవంతం చేసే పనిలో బిజీగా మారారు.
ఎలాగైనా సరే ఈసారి కాంగ్రెస పార్టీని పవర్ లోకి తీసుకు రావాలన్నదే తన లక్ష్యమని ప్రకటించారు కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్. ఈ మేరకు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే బస్సు యాత్రతో రాష్ట్రమంతటా పర్యటించారు. అధికారంలో ఉన్న బీజేపీ బొమ్మై సర్కార్ ను ఏకి పారేశారు. అవినీతిలో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా కర్ణాటకను నిలిపిన ఘనత సీఎంకే దక్కుతుందని ఎద్దేవా చేశారు డీకే శివకుమార్.
తాజాగా కర్ణాటక లోని హెగ్గనహళ్లిలో రోడ్ షో చేపట్టారు. వేలాదిగా తరలి వచ్చారు ప్రజలు. పెద్ద ఎత్తున ఆదరణ లభించడంతో సంతోషం వ్యక్తం చేశారు డీకే శివకుమార్. మీరందించిన ఉత్సాహం చూస్తుంటే కాంగ్రెస్ కు ఇక తిరుగు ఉండదని అనిపిస్తోందన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు కేపీసీసీ చీఫ్. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రకటించిన నాలుగు హామీలను అమలు చేస్తామని స్పష్టం చేశారు.
Also Read : కర్ణాటక ప్రభుత్వం అవినీతికి అందలం