CM YS Jagan : ప్రపంచాన్ని శాసించే లీడర్లు కావాలి
సత్య నాదెళ్ల ఒక్కరే కాదు మీరు ముందుండాలి
CM YS Jagan : యావత్ ప్రపంచాన్ని శాసించేలా ఏపీ యువత తయారు కావాలని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి సందింటి జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రపంచంలో మిమ్మల్ని బతికించేందుకు కాదు యావత్ లోకానికి మిమ్మల్ని లీడర్లుగా తయారు చేయాలన్నదే తన సంకల్పమని స్పష్టం చేశారు సీఎం. అనంతపురం జిల్లాలో జరిగిన జగనన్న దీవెన కార్యక్రమంలో జగన్ రెడ్డి(CM YS Jagan) ప్రసంగించారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిసారి సత్య నాదెళ్ల మన తెలుగు వాడు అని గొప్పగా చెప్పుకుంటాం.
మరి మీరెందుకు వేలాది మంది సత్య నాదెళ్ల లాగా, గూగుల్ సిఇఓ సుందర్ పిచాయ్ లాగా కాలేరని ప్రశ్నించారు. పట్టుదల , కృషి వుంటే సాధ్యం కానిది ఏదీ లేదన్నారు. ఇందు కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు, యువత చదువు కునేందుకు ఆర్థిక సాయం చేస్తోందని చెప్పారు. ఎన్ని కోట్లు అయినా సరే విద్యా రంగానికి తాము ఖర్చు చేసి తీరుతామని స్పష్టం చేశారు.
నా చెల్లెళ్లు, తమ్ముళ్లు అందరూ సత్య నాదెళ్లలు కావాలని ఏపీ సీఎం జగన్ రెడ్డి(CM YS Jagan) పిలుపునిచ్చారు. జగనన్న దీవెన కింద రాష్ట్రంలోని 9 లక్షల 55 వేల మంది విద్యార్థులకు , 8 లక్షల 61 వేల మంది తల్లుల ఖాతాల్లోకి రూ. 912.71 కోట్లు విడుదల చేశారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి సహాయం ఏ రాష్ట్రం చేయలేదని చెప్పారు.
Also Read : ప్రయాణీకులకు ఆర్టీసీ తీపి కబురు