Rajiv Shukla : కర్ణాటక సర్కార్ 1.5 లక్షల కోట్లు లూటీ
సంచలన ఆరోపణలు చేసిన కాంగ్రెస్
Rajiv Shukla : కర్ణాటకలో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. గత కొంత కాలంగా బొమ్మై ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వస్తోంది కాంగ్రెస్ పార్టీ. తాజాగా సంచలన ఆరోపణలు చేసింది. గత మూడు సంవత్సరాల కాలంలో కర్ణాటక ఖజానా నుంచి బీజేపీ బొమ్మై ప్రభుత్వం రూ. 1.5 లక్షల కోట్లు కొల్లగొట్టారని ఆరోపించింది.
ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా(Rajiv Shukla) ఈ కీలక ఆరోపణలు చేయడం కలకలం రేపింది. ఆయన మీడియాతో మాట్లాడారు.
కర్ణాటకలో ప్రభుత్వం 40 శాతం కమీషన్ పేరుతో దండుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మొత్తం కాల వ్యవధిలో ఏకంగా 12 స్కామ్ లు (కుంభకోణాలు) చోటు చేసుకున్నాయని వెల్లడించారు. ఆయా స్కామ్ ల వివరాలు బయట పెట్టారు.
వాటిలో టెండర్ స్కామ్, పీఎస్ఐ స్కామ్ , ల్యాండ్ గ్రాబ్ స్కామ్ , కోవిడ్ స్కామ్ , విజయేంద్ర కుంభకోణం, గుడ్డు స్కామ్ , పుడ్ కిట్ స్కామ్ , బిట్ కాయిన్ స్కామ్ , జాబ్ స్కామ్ , బ్యాంకు లోన్ స్కామ్, రాఘవేంద్ర స్కామ్ , బీడీఏ స్కామ్ ఉన్నాయని స్పష్టం చేశారు.
ఇవాళ దేశంలోనే అతి పెద్ద అవినీతి , అక్రమాలకు కేరాఫ్ గా ఉన్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది కర్ణాటకనేనని పేర్కొన్నారు రాజీవ్ శుక్లా(Rajiv Shukla).
Also Read : కోహ్లీ మెరిసినా తప్పని ఓటమి