YS Sharmila : పేపర్ లీకేజీలో ఐటీ శాఖదే కీలకం – షర్మిల
వైఎస్సార్ టీపీ చీఫ్ గవర్నర్ కు లేఖ
YS Sharmila : వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో చోటు చేసుకున్న పరీక్ష పేపర్ లీకేజీల వ్యవహారం కలకలం రేపింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సిట్ ను ఆదేశించింది. ఇప్పటికీ నెలన్నర గడిచినా ఇంత వరకు పూర్తి నివేదిక సమర్పించ లేదని, దీని వెనుక గల కారణాలు ఏమిటో చెప్పాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కు బహిరంగ లేఖ రాశారు.
పేపర్ లీక్ కు ప్రధాన కారణం ఐటీ శాఖేనని ఆరోపించారు వైఎస్ షర్మిల. దీనికి పూర్తిగా బాధ్యత వహించాల్సింది ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్ అని సంచలన ఆరోపణలు చేశారు. సాక్షాత్తు సీఎం కేసీఆర్(CM KCR) తనయుడి నిర్వహిస్తున్న ఐటీ పూర్తిగా బాధ్యత వహించాలని పేర్కొన్నారు వైఎస్ షర్మిల. ఇదే సమయంలో ఈ పేపర్ లీకేజీ వ్యవహారానికి సంబంధించి ఐటీ విభాగం పాత్ర ఏమిటో , సిట్ అధికారులు ఎంత దాకా విచారించారో పూర్తి నివేదికను బయట పెట్టేలా గవర్నర్ ఆదేశించాలని వైఎస్ షర్మిల కోరారు.
ఇదిలా ఉండగా టీఎస్పీఎస్సీ(TSPSC) పేపర్ లీకేజీ వ్యవహారానికి సంబంధించి హైకోర్టులో కాంగ్రెస్ పార్టీ నేత బల్మూరి వెంకట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. రాజకీయ నాయకులు తమ అవసరాల కోసం, ప్రయోజనాల కోసం ఎన్నో రకాలుగా ఆరోపణలు చేస్తారని వారిని ఎలా విచారిస్తారంటూ సిట్ ను ప్రశ్నించింది. ఈనెల ఇదే కేసుకు సంబంధించి తుది తీర్పును 28న వెలువరిస్తామని కోర్టు స్పష్టం చేసింది.
Also Read : నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు – కేసీఆర్