Azam Khan : అతిక్ అహ్మ‌ద్ లాగా న‌న్ను చంపేస్తారేమో

స‌మాజ్ వాదీ పార్టీ సీనియ‌ర్ నేత

Azam Khan : స‌మాజ్ వాది పార్టీ సీనియ‌ర్ నేత‌, ఎమ్మెల్యేగా అన‌ర్హ‌త వేటుకు గురైన ఆజం ఖాన్(Azam Khan) సంచ‌ల‌న కామెంట్స్ చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. ఇటీవ‌లే ప్ర‌యాగ్ రాజ్ లో గ్యాంగ్ స్ట‌ర్స్ అతిక్ అహ్మ‌ద్ , అశ్ర‌ఫ్ అహ్మ‌ద్ ల‌ను కాల్చి చంపారు. నేర సామ్రాజ్యం సృష్టించిన అతిక్ అహ్మ‌ద్ ఏకంగా రూ. 11,000 వేల కోట్ల ఆస్తుల‌ను సంపాదించాడు. అత్యాచారాలు, హ‌త్య‌లు, నేరాలు, ఘోరాలు , అక్ర‌మ ఆస్తుల‌కు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఆ ఇద్ద‌రి కాల్చివేత దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం క‌లిగించింది. ఏపీ సీఎం యోగి ఒక్క‌సారిగా హీరోగా మారి పోయాడు.

ఇదిలా ఉండ‌గా శ‌నివారం ఆజం ఖాన్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. త‌నను కూడా అతిక్ అహ్మ‌ద్ లాగానే చంపుతారేమోన‌ని అనుమానం వ్య‌క్తం చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. కాగా దీర్ఘ కాలంగా అనారోగ్యంతో బాధ ప‌డుతున్న ఆజం ఖాన్ చాలా కాలం త‌ర్వాత యూపీలో రాబోయే పౌర ఎన్నిక‌ల ప్ర‌చారం కోసం వేదిక పైకి వ‌చ్చారు. ద్వేష పూరిత ప్ర‌సంగం కేసులో దోషిగా తేల‌డంతో ఆజం ఖాన్ ఎమ్మెల్యేగా అన‌ర్హ‌త వేటు ప‌డింది.

యూపీలోని రాంపూర్ లో ఈ కామెంట్స్ చేశారు ఆజం ఖాన్. ఎవ‌రు ఎప్పుడు త‌ల‌పై ట్రిగ్గ‌ర్ నొక్కుతారో తెలియ‌డం లేద‌ని వాపోయాడు. ఓటు వేయ‌డం మా జ‌న్మ హ‌క్కు. చివ‌ర‌కు అది కూడా మీరు తీసేసుకుంటే ఇంక మేం ఎక్క‌డికి పోవాల‌న్నాడు ఆజం ఖాన్(Azam Khan).

Also Read : బ్రిజ్ భూష‌ణ్ ను తొల‌గించండి

Leave A Reply

Your Email Id will not be published!