PM Modi Mann Ki Baat : ఆ నలుగురి స్పూర్తి ప్రశంసనీయం
మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్
PM Modi Mann Ki Baat : మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. తన జీవితంలో ఇది మరిచి పోలేని సన్నివేశమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఎందరో స్పూర్తి దాయకంగా నిలిచారని తెలిపారు.
కోట్లాది మంది భారతీయుల భావాలకు వ్యక్తీకరించేలా చేసిందన్నారు. ప్రజలతో అనుసంధానం కావడం అభినందనీయమన్నారు. గతంలో ప్రస్తావించిన విశిష్ట వ్యక్తులతో ఇవాళ ప్రధానమంత్రి మాట్లాడారు. వారిలో నలుగురు కీలకమైన వ్యక్తులు ఉన్నారు. మణిపూర్ కు చెందిన విజయశాంతి దేవి. తామర పువ్వులతో బట్టలు తయారు చేస్తుంది.
పర్యావరణ అనుకూలమైన ఆలోచన గురించి మన్ కీ బాత్ లో మోదీ (PM Modi Mann Ki Baat) ప్రస్తావించారు. ఆమె వద్ద 30 మంది మహిళలు పని చేస్తున్నారు. ఈ ఏడాదిలో 70 మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ప్రదీప్ సాంగ్వాన్ హీలింగ్ హిమాలయాస్ ప్రచారం చేపట్టారు. రోజూ ఐదు టన్నుల చెత్తను సేకరిస్తారు. మంజూర్ అహ్మద్ జమ్మూ కాశ్మీర్ లోని ఓ పల్లెలో పెన్సిల్ ల తయారీ యూనిట్ కలిగి ఉన్నాడు. 200 మందికి ఉపాధి కలుగుతోంది. ఓఖూ గ్రామాన్ని పెన్సిల్ విలేజ్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. వీరి గురించి ప్రత్యేకంగా తెలిపారు మోదీ.
Also Read : బేటీ బచావో బేటీ పడావో – మోదీ