PM Modi Congratulate : మరాఠా దినోత్సవం మోదీ సందేశం
మహారాష్ట్ర ఏర్పాటుపై అభినందన
PM Modi Congratulate : మే 1న మహారాష్ట్ర రాష్ట్రంగా ఏర్పడిన రోజు. మరాఠా దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ దినోత్సవాన్ని సాధారణంగా మహారాష్ట్ర దివస్ అని పిలుస్తారు. బొంబాయి రాష్ట్రాన్ని భాషా ప్రాతిపదికన రెండు రాష్ట్రాలుగా విభజించినందుకు గుర్తుగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. గుజరాత్, మహారాష్ట్రలుగా విడి పోయాయి. మరాఠా వాసులకు శుభాకాంక్షలు తెలిపారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi Congratulate).
గొప్పనైన చరిత్ర, సంస్కృతి, వారసత్వాన్ని కలిగి ఉన్నదని మరాఠా గురించి ప్రస్తావించారు పీఎం. ఇక్కడి ప్రజలు నిరంతరం కష్ట పడేందుకు ఇష్ట పడతారని తెలిపారు ప్రధాని(PM Modi). వివిధ రంగాలలో జాతీయ ప్రగతిని సుసంపన్నం చేసిన గొప్ప సంస్కృతి కలిగి ఉందన్నారు. రాబోయే సంవత్సరాలలో మహారాష్ట్ర అన్ని రంగాలలో మరింత ప్రగతిని, పురోగతిని సాధించాలని ప్రధాని ఆకాంక్షించారు.
మే1న 63వ మహారాష్ట్ర దినోత్సవం సందర్బంగా ఆ రాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే మరాఠా స్థాపన కోసం ప్రాణాలు అర్పించిన యోధులకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఇదిలా ఉండగా గుజరాత్ , మహారాష్ట్ర బొంబాయి పునర్ వ్యవస్థీకరణ చట్టం మే 1, 1960 నుండి అమలు లోకి వచ్చింది. అనేక నిరసనలు, ఉద్యమాల ఫలితంగా రాష్ట్రం ఏర్పాటైంది.
Also Read : పవర్ లోకి వస్తే ఉమ్మడి పౌర స్మృతి