Congress Manifesto : ప్రజా వ్యతిరేక చట్టాలు రద్దు – కాంగ్రెస్
భజరంగ్ దళ్..పీఎఫ్ఐపై చర్యలు
Congress Manifesto : కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ మంగళవారం మ్యానిఫెస్టోను విడుదల చేసింది. భారతీయ జనతా పార్టీకి చెందిన భజరంగ్ దళ్ తో పాటు పీఎఫ్ఐ సంస్థపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఆమోదించిన అన్ని అన్యాయమైన , ఇతర ప్రజా వ్యతిరేక చట్టాలను రద్దు చేస్తామని ప్రకటించింది. కాంగ్రెస్ చేసిన ఈ ప్రకటన ఒక రకంగా సంచలనం అని చెప్పక తప్పదు.
విద్వేషాన్ని వ్యాప్తి చేసే సంస్థలపై చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. మే 10న అసెంబ్లీ పోలింగ్ జరగనుంది. నిషేధిత ఇస్లామిస్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాని సంఘ్ అనుబంధ సంస్థ విశ్వ హిందూ పరిషత్ యువజన విభాగం భజరంగ్ దళ్ లతో సమానం చేసింది. ఇలాంటి సంస్థలను నిషేధిస్తామని తెలిపింది.
కులం లేదా మతం ఆధారంగా వర్గాల మధ్య ద్వేషాన్ని వ్యాప్తి చేసే వ్యక్తులు, సంస్థలపై నిర్ణయాత్మక చర్య తీసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేసింది పార్టీ. బీజేపీ అక్రమంగా కొలువు తీరాక తీసుకు వచ్చిన అన్ని చట్టాలను పూర్తిగా ఏడాది లోపు సమీక్షించి రద్దు చేస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ(Congress Manifesto).
అందరికీ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ , ప్రతి మహిళ కుటుంబ పెద్దకు నెలకు రూ. 2,000, 10 కిలోల ఆహార ధాన్యాలు , యువ నిధి కోంద నిరుద్యోగ గ్రాడ్యూయేట్స్ కు 2 ఏళ్ల పాటు ప్రతి నెలా రూ. 3,000, డిప్లొమా హోల్డర్లకు ప్రతి నెలా రూ. 1,500 , ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ వసతి కల్పిస్తామని మ్యానిఫెస్టోలో వెల్లడించింది .
Also Read : బీజేపీవి చిల్లర రాజకీయాలు – స్టాలిన్