PM Modi : మా మేనిఫెస్టో అద్భుతం అధికారం ఖాయం

స్ప‌ష్టం చేసిన ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ

PM Modi : దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోదర దాస్ మోదీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. క‌ర్ణాట‌క‌లో ఈనెల 10న పోలింగ్ జ‌ర‌గ‌నుంది. 13న ఫ‌లితాలు రానున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మ‌రోసారి ప‌వ‌ర్ లోకి రావాల‌ని య‌త్నిస్తోంది. మ‌రో వైపు కాంగ్రెస్ కూడా ఇదే రీతిన గ‌ట్టి పోటీ ఇస్తోంది. ఈ త‌రుణంలో ప్ర‌ధాన మంత్రి(PM Modi) అన్నీ తానై క‌ర్ణాట‌క‌ను జ‌ల్లెడ ప‌ట్టారు. ఇప్ప‌టికే ప‌లుమార్లు ప‌ర్య‌టించారు. హామీల వ‌ర్షం కురిపించారు. ఆపై అడ‌గుకుండానే క‌ర్ణాట‌క‌కు భారీ ఎత్తున నిధులు మంజూరు చేశారు.

మంగ‌ళ‌వారం న‌రేంద్ర మోదీ సుడిగాలి ప‌ర్య‌ట‌న చేశారు. చిత్ర‌దుర్గ‌లో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో పాల్గొని ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్బంగా త‌మ పార్టీ విడుద‌ల చేసిన మేనిఫెస్టో అద్భుతంగా ఉంద‌న్నారు. కాంగ్రెస్ పార్టీ ఖ‌తం కావ‌డం ఖాయ‌మ‌న్నారు. మ‌రోసారి అధికారంలోకి వ‌స్తామ‌ని, ఇచ్చిన హామీల‌ను నెర‌వేరుస్తామ‌ని, ఆ బాధ్య‌త త‌న‌ద‌ని ప్ర‌క‌టించారు న‌రేంద్ర మోదీ. గ‌తంలో పాల‌కులు రాష్ట్రాన్ని ప‌ట్టించు కోలేద‌న్నారు. అవినీతికి కేరాఫ్ గా నిలిచేలా చేశార‌ని ఆరోపించారు. కానీ తాము వ‌చ్చాక పార‌ద‌ర్శ‌క పాల‌న అందిస్తున్నామ‌ని చెప్పారు ప్ర‌ధాన‌మంత్రి(PM Modi).

అన్ని వ‌ర్గాలను ఆదుకునేందుకు ఇప్ప‌టికే ఎన్నో సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేశామ‌ని చెప్పారు. తాజాగా బీజేపీ విడుద‌ల చేసిన ఎన్నిక‌ల మేనిఫెస్టో అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు మేలు చేకూర్చేలా ఉంద‌న్నారు. క‌ర్ణాట‌క‌ను దేశంలోనే నెంబ‌ర్ వ‌న్ గా మారుస్తామ‌ని చెప్పారు.

Also Read : చిత్ర‌దుర్గ‌లో డ‌ప్పు కొట్టిన మోదీ

Leave A Reply

Your Email Id will not be published!