PM Modi Drums : చిత్రదుర్గలో డప్పు కొట్టిన మోదీ
సోషల్ మీడియాలో పీఎం హల్ చల్
PM Modi Drums : దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి వైరల్ గా మారారు. ఆయన ఎక్కడికి వెళ్లినా ఉత్సాహం ఉరక లేస్తుంది. చైతన్యానికి ప్రతిరూపంగా ఉంటారు. ఆయా ప్రాంతాల పరిస్థితులకు తగినట్లుగా వేషధారణ ఉంటుంది. వాళ్లలో కలిసి పోయేలా తనను తాను మార్చుకుంటారు నరేంద్ర మోదీ.
ప్రస్తుతం కర్నాటకలో ఈనెల 10న ఎన్నికలు జరగనున్నాయి. 13న ఫలితాలు వస్తాయి. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో కొలువు తీరి ఉంది. బొమ్మై సారథ్యంలో మరోసారి అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తోంది బీజేపీ. ఇప్పటికే అమిత్ షా, జేపీ నడ్డాతో పాటు ప్రధాని మోదీ పలుమార్లు పర్యటించారు. ఒక రకంగా మోదీ(PM Modi Drums) గతంలో లేని విధంగా ఈసారి సుడిగాలి పర్యటన చేశారు. అంతకు ముందు కోట్లాది రూపాయలు రాష్ట్రానికి మంజూరు చేశారు. మరోసారి గెలిపిస్తే కర్నాటకను అన్ని రాష్ట్రాల కంటే ముందంజలో నిలుపుతామని ప్రకటించారు.
ఇదిలా ఉండగా ప్రధానమంత్రి మంగళవారం కర్నాటకలో పర్యటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చిత్రదుర్గలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. అంత కంటే ముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ డప్పును వాయించారు. కన్నడిగుల సంస్కృతిలో ఒక భాగం డప్పును ఉపయోగించడం. ప్రస్తుతం ఈ ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాలలో హల్ చల్ చేస్తున్నాయి.
Also Read : మా మేనిఫెస్టో అద్భుతం అధికారం ఖాయం