Raghav Chadha : నేను నిందితుడిని కాను – రాఘవ్ చద్దా
సాక్షిని లేదా అనుమానితుడిని కాను
Raghav Chadha : ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు, పంజాబ్ గౌరవ సలహాదారు రాఘవ్ చద్దా షాకింగ్ కామెంట్స్ చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇవాళ ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించిన కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ ఛార్జి షీట్ దాఖలు చేసింది. ఇందులో ప్రత్యేకంగా ఆప్ కు చెందిన ఎంపీలు సంజయ్ సింగ్ , రాఘవ్ చద్దా(Raghav Chadha) పేర్లను కూడా ప్రస్తావించింది.
దీనిపై నిప్పులు చెరిగారు ఎంపీ రాఘవ్ చద్దా. ఎలాంటి సమాచారం తెలుసు కోకుండానే తనపై బురద చల్లుతున్నారని, ఇది మంచి పద్దతి కాదని పేర్కొన్నారు. ఏదైనా రాసే ముందు లేదా ప్రసారం చేసే ముందు తన వివరణ కోరాలని ఆ మాత్రం తెలుసుకోకుండా ఎలా బ్రేకింగ్స్ వేస్తారంటూ ధ్వజమెత్తారు రాఘవ్ చద్దా.
ఇదిలా ఉండగా ఢిల్లీ లిక్కర్ స్కాం దేశంలో కలకలం రేపింది. ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి 34 మందిపై అభియోగాలు మోపింది. ఇప్పటికే తీహార్ జైలులో ఉన్నారు మనీష్ సిసోడియా. ఇక రెండో ఛార్జి షీట్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, భర్త అనిల్ , ఆప్ కన్వీనర్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) ను చేర్చింది.
ఇప్పటి వరకు కవిత మూడుసార్లు ఈడీ ముందు హాజరైంది. తాజాగా ఈడీ ఇద్దరు ఆప్ ఎంపీలను చేర్చడం కలకలం రేపింది. తాను సిసోడియాతో జరిగిన సమావేశంలో మాత్రమే ఉన్నానని తాను నిందితుడిని, సాక్షి, లేదా అనుమానితుడిని కానంటూ స్పష్టం చేశారు.
Also Read : బీజేపీ సర్కార్ అవినీతికి కేరాఫ్ – రాహుల్